Pawan Kalyan : జనసేన పవన్‌ కల్యాణ్‌కు అరుదైన అవకాశం

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 11:18 AM IST

United Nations: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)కు అరుదైన అవకాశం లభించింది. ఐక్యరాజ్య సమితి(United Nations) పవన్‌కు ఆహ్వానించింది. దీంతో ఈ నెల 22న జరిగే సదస్సులో జనసేనాని పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయన ఈ నెల 20న న్యూయార్క్‌ బయల్దేరి వెళ్లనున్నారని తెలుస్తుంది. కాగా, దేశం త‌ర‌ఫున పాటుప‌డే న‌లుగురికి మాత్ర‌మే ఈ అవ‌కాశం ద‌క్కుతుంది. ఇలాంటి అరుదైన అవ‌కాశాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌క్కించుకున్నారు. నిస్వార్థంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేసే నేత‌ల‌కు మాత్ర‌మే ఇలాంటి అవకాశం ద‌క్కుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలాఉంటే.. ప్ర‌స్తుతం జ‌న‌సేన అధినేత‌ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆయ‌న విరివిగా ఎన్నిక‌ల‌ ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొంటున్నారు. టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు కేటాయించిన సీట్ల‌లో త‌మ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునే ప‌నిలో ప‌వ‌న్ త‌ల‌మున‌క‌లై ఉన్నారు.

Read Also: KTR Hot Comments: నా పదవికి రాజీనామా చేస్తా.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మరోవైపు అవనిగడ్డలో జరిగిన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, క్రికెటర్ అంబటి రాయుడు ఇద్దరూ వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారేనని, వారు నిజంగా జగన్ ను నమ్మారని, అలాంటి వాళ్లే వైసీపీని వదిలి వచ్చేశారంటూ అందరూ ఆలోచించాలని అన్నారు. మనం మనుషులం.. రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది.. కానీ ఈ వైసీపీ ఆత్మగౌరవాన్ని తీసేస్తోందని అన్నారు. కార్యకర్తల పక్షాన నిలబడే వ్యక్తి బాలశౌరి.. కార్యకర్తలకు, జనసైనికులకు బలం ఇచ్చాడు. అలాంటి నాయకుడ్ని బందరు పార్లమెంటు నుంచి బరిలో దింపాను. ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి. బాలశౌరి జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు… అతని బ్యాలెట్ నంబర్ 6… గాజు గాజు గుర్తుపై ఓటు వేసి బాలశౌరిని గెలిపించండి. అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయన బ్యాలెట్ నంబర్ 6… గాజు గుర్తుపై ఓటు వేసి బుద్ధప్రసాద్‌ను గెలిపించండి’’ అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.