Site icon HashtagU Telugu

Pawan Kalyan : నాతో స్నేహం అంటే చచ్చేదాక – పవన్ కళ్యాణ్

Pawan Speech 2

Pawan Speech 2

తాడేపల్లి గూడెం లో జరిగిన జనసేన – టీడీపీ ఉమ్మడి సభలో ఇరు పార్టీల నేతలు భారీ డైలాగ్స్ పేల్చారు. జగన్ కోటలు బద్దలు కావాలంటూ మాట్లాడిన తీరుకు కార్యకర్తలు ఫిదా అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ మరోసారి తన కసిని చూపించారు. పవన్‌తో స్నేహం అంటే పవన్ చచ్చేదాక.. వైరం అంటే అవతలి వాడు చచ్చేదాకా అంటూ సినిమా రేంజ్ డైలాగ్ పేల్చారు. ‘ఇద్దరు కలిసినా, పది మంది పచ్చగా ఉన్నా జగన్ ఓర్వలేడు. సొంత కుటుంబాన్ని, ప్రజల్ని హింసించే ఇలాంటి వాళ్లని సైకో అంటారు. గెలిచినా, ఓడినా నేను ప్రజలతోనే ఉంటా. పవన్ అంటే దేశ యువత కనే కలలు, ఆడబిడ్డలకు రక్షణగా ఉండే రాఖీ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా’ అని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్… సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. జగన్… నీ కోటలు బద్దలు కొడతాం అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. “మనం ఏమిటో వైసీపీ వాళ్లకు ఎన్నికల తర్వాత అర్థమవుతుంది… నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా… అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్… జనసేన ఒక్క సీటు గెలిస్తేనే… నేను రాజమండ్రికి వస్తుంటే రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. 10వ తరగతి పిల్లలు రాత్రంతా చదువుకుని పరీక్షకు సిద్ధమైనట్టు మీరు రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. ఇప్పటిదాకా పవన్ కల్యాణ్ తాలూకు శాంతినే చూశావు… ఇక నా యుద్ధం ఏంటో చూస్తావు” అంటూ వార్నింగ్ ఇచ్చారు. జగన్‌ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్‌ కళ్యాణేకాదంటూ హెచ్చరించారు. పొత్తులో భాగంగానే 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నానన్న పవన్ కళ్యాణ్.. 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించిందని అన్నారు. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారనీ.. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో తెలుస్తుందన్నారు. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలేనన్న పవన్ కళ్యాణ్.. అంకెలు లెక్కపట్టవద్దని విపక్షాలకు సలహా ఇచ్చారు. అలాగే తనకు సలహాలు ఇచ్చేవాళ్లు అవసరం లేదని.. యుద్ధం చేసేవాళ్లు కావాలని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల తరపున వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరిస్తున్నా..పొత్తు గెలవాలి.. జగన్‌ పోవాలి.. వైసీపీ నేలమట్టం అవ్వాలి అంటూ పవన్ చెప్పుకొచ్చారు.

Read Also : Benefits with Sneezing : తుమ్ము వస్తే తుమ్మేయండి.. ఎన్ని బెనిఫిట్సో తెలుసా ?