జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి పవన్ కళ్యాణ్ తన సతీమణితో కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్ రాకతో పోలింగ్ బూత్ వద్ద కాస్త తోపులాట చోటుచేసుకుంది. పవన్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి కంట్రోల్ చేయడానికి, జనాలను అదుపు చేయడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇదిలా ఉంటె రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ మొదలైంది. తెలంగాణ 17 లోక్ సభ ఎన్నికలకు , ఏపీలో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం నుండి సినీ , రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు. ఇదే క్రమంలో పలుచోట్ల ఈవీఎంలు సరిగ్గా పని చేయక మొరాయిస్తున్నాయి. దీంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలవ్వడం, కొన్ని చోట్ల మధ్యలో ఆగిపోవడం లాంటివి జరుగుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన భార్య నారా బ్రహ్మణి మంగళిగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్‌లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ట్విట్టర్ వేదికగా ‘‘మార్పు కావాలని కోరుకోవడం కాదు మార్పు మనతో మొదలుకావాలి. మీ ఓటుతోనే భవిష్యత్తు ముడిపడి ఉంది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను’’ అంటూ ఓటర్లకు తన సందేశాన్ని ఇచ్చారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ట్విట్టర్ వేదికగా ఓటర్లకు సందేశం ఇచ్చారు. ‘‘మీ భవిష్యత్తును, మీ రాష్ట్ర భవిష్యత్తును ఈరోజు మీరు వేసే ఓటు నిర్ణయిస్తుంది. అందుకే ఇళ్ల నుంచి కదలండి’’ అంటూ ఓటర్లను ఆయన పిలుపునిచ్చారు.
ఇక సీఎం జగన్ ..‘‘నా అవ్వాతాతలందరూ…నా అక్కచెల్లెమ్మలందరూ… నా అన్నదమ్ములందరూ… నా రైతన్నలందరూ… నా యువతీయువకులందరూ… నా ఎస్సీ… నా ఎస్టీ… నా బీసీ… నా మైనారిటీలందరూ… అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!’’ అంటూ సోషల్ మీడియా వేదికగా తన సందేశం ఇచ్చారు.
Read Also : Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు