జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నమాటను నిలబెట్టుకున్నారు. పిఠాపురంలో భారీ విజయం సాధించిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ముందే నూకాంబిక (Anakapalli Nookambika ) అమ్మవారిని దర్శించుకుంటానని ఎన్నికల ప్రచారంలో తెలిపారు. చెప్పినట్లే ఈరోజు అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా ఆలయ అధికారులు , అర్చకులు జనసేనానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం, పవన్ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని అర్చనలు చేశారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించి, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఇక ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఓట్లను చీల్చకూడదనే ఉద్దేశ్యంతో టిడిపి – బిజెపి లతో పొత్తు పెట్టుకొని ఘన విజయం సాధించారు. మొత్తం 164 అసెంబ్లీ , 21 పార్లమెంట్ స్థానాలతో విజయ డంఖా మోగించారు. ఈ నెల 12 న సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయబోతున్నట్లు సమాచారం.
#WATCH | Jana Sena Party chief Pawan Kalyan offered prayers at the Nookalamma temple in Anakapalli, Andhra Pradesh. pic.twitter.com/A07fd3efFO
— ANI (@ANI) June 10, 2024
Read Also : Assembly Elections : త్వరలో ‘మహా’ మార్పు.. అసెంబ్లీ పోల్స్‌కు రెడీ కండి : శరద్ పవార్