Site icon HashtagU Telugu

Pawan Kalyan : పిఠాపురంలో పవన్ ‘వారాహి యాత్ర’కు బ్రేక్..

Pawan Kalyan (2)

Pawan Kalyan (2)

జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి సంబంధించిన తొలి రోజునే చేదు అనుభం ఎదురైంది. చేబ్రోలులో పవన్ కళ్యాణ్ వారాహి సభ (Varahi Sabha)కు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే.. ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి ఆయన తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా మొదటి ఐదు రోజులు పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈ రోజలు ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్ లో పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ స్ధానిక టీడీపీ (TDP) నేత వర్మ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబం ఆశీర్వాదం తీసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆ తరువాత.. పిఠాపురం దత్తపీఠంలోని పురూహుతిక అమ్మవారి దర్శనం చేసుకుని పవన్‌ తన ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉండగా.. ఆయన చేరుకునే సరికే ఆలయం మూసివేసి ఉంది.. దీంతో.. ఆయన దర్శనం సాయంత్రానికి వాయిదా పడింది. దర్శనం తర్వాత వారాహి వాహనంపై పిఠాపురంలో తొలి ఎన్నికల సభ ఏర్పాటు చేసేందుకు పవన్ సిద్ధమవుతున్న క్రమంలో ఆయనకు స్ధానిక పోలీసులు షాకిచ్చారు. సాయంత్రం 4 గంటల తర్వాత వారాహి వాహనంతో అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు పవన్ సిద్ధం కాగా దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

వారాహిపై సాయంత్రం పిఠాపురంలో నిర్వహించే సభకు అనుమతి లేదని పోలీసులు పవన్ కళ్యాణ్‌కు తెలిపారు. ముందుగా అనుమతి తీసుకోకపోవడంతో వారాహిపై సభను నిర్వహించకూడదని పోలీసులు వెల్లడించారు. అయితే. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీని వైసీపీ (YSRCP) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తొలిరోజే ఆయనకు ఆటంకాలు కల్పిస్తున్నారని జనసైనికులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Nallamilli Ramakrishna Reddy : అనపర్తి టీడీపీ ఇంచార్జికి బీజేపీ ఆఫర్‌..!