Site icon HashtagU Telugu

Pawan Kalyan : అమ్మవారి దీక్ష చేపట్టబోతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Pawan Deeksha

Pawan Deeksha

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) ఈ నెల 26 నుండి వారాహి అమ్మవారి దీక్ష (Varahi Ammavari Deeksha) చేపట్టనున్నారు. 11 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు. ఈ దీక్ష‌లో భాగంగా పాలు, పండ్లు, లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకోనున్నారు. గత ఏడాది జూన్‌లో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. యాత్ర సందర్భంగా కూడా వారాహిమాతకు పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఇప్పుడు ఎన్నికల్లో భారీ విజయం సాధించడం..తాను అనుకున్నది జరగడం తో..మరోసారి దీక్ష చేపట్టబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు తెలుసుకునే పనిలో పడ్డారు. జనవాణి కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలు పవన్ కళ్యాణ్ కు చెప్పుకోవడం జరిగింది. వెంటనే పవన్ కూడా ఆ సమస్యలు తీర్చే బాధ్యత చేపట్టారు. సోమవారం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పవన్ కల్యాణ్ ను కలిశారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన అనిత… పవన్ కల్యాణ్ కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పీహెచ్ డీ రామకృష్ణ, డీసీపీ ఆదిరాజ్ రాణా కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. వారు పవన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సినీ ప్రముఖులు సైతం పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగింది.

Read Also : CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ..

Exit mobile version