Site icon HashtagU Telugu

Flooded : వరదలో మునిగిన జగనన్న కాలనీ లపై పవన్ ట్వీట్..

Pawan Kalyan Tweet to Jagananna Colonies

Pawan Kalyan Tweet to Jagananna Colonies

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అధికార పార్టీ వైస్సార్సీపీ (YCP) ఫై విమర్శలు చేసారు. గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే. తెలంగాణ తో పోలిస్తే ఏపీలో కాస్త వర్షాలు తక్కువగానే పడ్డాయి. అయితే ఈ వర్షాలకు జగనన్న కాలనీ లు (Floods In Jagananna Colonies) నీటమునిగాయి. దీనిపై పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు.

కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అరకొర నిర్మాణాలు, ముంపు ప్రాంతాల్లో స్థలాల కేటాయింపులు, కనీస మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితులు, పేదలకు అండగా అంటూ, పేదలను సమాజానికి దూరం చేసేలా..వైస్సార్సీపీ నాయకుల జేబులు నింపేలా జగనన్న కాలనీలు..అని పవన్ ట్వీట్ చేసారు.

రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు నీటమునిగిన జగనన్న కాలనీ (Jagananna Colonies) లను సందర్శిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. కొద్దీ పాటి వర్షానికే జగనన్న కాలనీలు నీట మునిగాయని విమర్శిస్తున్నారు. చినుకుపడితే కాలనీలోకి వెళ్లాలంటే నరకం కనపిస్తుందన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించి పేదల ఇళ్ల నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలంటున్నారు.

ప్రభుత్వం (YCP) గొప్పగా చెప్పుకుంటున్న పేదవారి సొంత ఇంటి కల.. కలగానే మిగిలిపోయేలా ఉందని, ప్రభుత్వం పేదలకు పంచిన జగనన్న కాలనీల ఇళ్ల స్థలాలు రాష్ట్రంలో చాలా చోట్ల వర్షం నీటిలో మునిగిపోయాయని.. అందులో ఇళ్లు కట్టుకుంటే ఎలా ఉండేదని లబ్దిదారులు లబోదిబోమంటున్నారని జనసేన శ్రేణులు వాపోతున్నారు. కొన్ని చోట్ల అయితే మరి దారుణంగా ఉన్నాయని ..పొలాలకు , చెరువులకు , ఇళ్ల కు పెద్ద తేడాలేదన్నారు. ప్రజల కోట్ల సొమ్మును వైసీపీ నేతలు (YCP Leaders) వారి జేబులలో వేసుకుంటూ..నాణ్యత లేని ఇల్లు నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : తమిళనాడు సీఎం స్టాలిన్ కు జనసేన అధినేత లేఖ..