Site icon HashtagU Telugu

Pawan : బంగ్లాదేశ్ పరిస్థితులపై పవన్ కళ్యాణ్ ట్వీట్..ఏమన్నారంటే?

Pawan Kalyan tweet on the situation in Bangladesh

Pawan Kalyan

Pawan Kalyan tweet on Bangladesh situation: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బంగ్లాదేశ్ లోని పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. “బంగ్లాదేశ్ నుండి వచ్చిన చిత్రాలు హృదయ విదారకంగా ఉన్నాయి” అని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ (CPB) నాయకుడు ప్రదీప్ భౌమిక్‌ను పగటి వెలుగులో క్రూరంగా హత్యచేయడం, హిందూ దేవాలయాలను (ఇస్కాన్ & కాళీ మాత దేవాలయం) ధ్వంసం చేయడం, మైనారిటీలను దారుణంగా చంపడం మరియు హిందూ మైనారిటీలపై క్రైస్తవులు, బౌద్ధులపై హింసను లక్ష్యంగా చేసుకోవడం వంటి ఘటనలను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. “బంగ్లాదేశ్ లో తక్షణ చర్యలు అవసరం. శాంతి, భద్రతను పునరుద్ధరించాలని, భారతదేశంలోని @unhumanrights @UN_HRC మరియు బంగ్లాదేశ్ హైకమిషన్ ను కోరుతున్నాను. బంగ్లాదేశ్ లోని మైనారిటీలు, హిందువులందరికీ భద్రత మరియు స్థిరత్వం కోసం ప్రార్థిస్తున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు.. బంగ్లాదేశ్ లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులను నిరసిస్తూ ఢాకా, చట్టగ్రామ్ నగరాల్లో వరుసగా రెండో రోజూ వేలాదిమంది హిందువులు ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనలకు సంఘీభావంగా వేలాదిమంది ముస్లింలు, విద్యార్థులు పాల్గొన్నారు. “మైనారిటీలను వేధిస్తున్నవారిపై విచారణ వేగవంతం చేయాలి, ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. పార్లమెంటులో 10 శాతం సీట్లను మైనారిటీలకు కేటాయించాలి” అనే డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢాకాలోని షాబాగ్ ప్రాంతంలో నిరసన సమయంలో మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ప్రపంచవ్యాప్తంగా, బంగ్లాదేశ్ లో హిందువులపై హింసాత్మక దాడులపై ఆందోళనలు వెల్లువెత్తాయి. లండన్, వాషింగ్టన్ డీసీ సహా ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించబడాయి. లండన్ లో పార్లమెంట్ భవనం ఎదుట మరియు అమెరికా వైట్‌హౌస్ ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద కూడా శనివారం ఆందోళన జరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు మొహమ్మద్ యూనస్, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులను కాపాడవలసిందిగా యువతను కోరారు.

Read Also: Ganesh Chaturthi: గణేష్ చతుర్థి 2024 ఎప్పుడు? ముగింపు ఏ రోజు..?