Site icon HashtagU Telugu

BYJU’s : మరోసారి బైజూస్ కాంట్రాక్ట్‌పై ప్రభుత్వానికి వరుస ప్రశ్నలు సంధించిన జనసేనాని

pawan Kalyan tweet on BYJU's

pawan Kalyan tweet on BYJU's

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ వైస్సార్సీపీ ని వరుస ప్రశ్నలతో అతలాకుతలం చేస్తున్నారు. ఏలూరు వారాహియాత్ర లో వాలంటీర్ల వ్యవస్థ లో లోపాలు జరుగుతున్నాయని ప్రశ్నించిన పవన్..ఇప్పుడు బైజూస్ (BYJUS) కాంట్రాక్ట్‌పై వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆదివారం మరో ట్వీట్ చేసారు. బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందానికి సంబంధించి కొన్ని విషయాలు నోట్ చేసుకోవాలంటూ కీలక అంశాలు సంధించారు.

1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది.

2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇస్తామని ఒప్పుకున్నారు.

3. వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం 580 కోట్ల ఖర్చుతో 5 లక్షల ట్యాబ్లెట్లు కొననుందా? అని కీలక అంశాలు లెవనెత్తుతూ పవన్ ట్వీట్ చేశారు.

ప్రశ్నించదగిన అంశాలు :

1. బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుండి ఖర్చు ఎవరు చెల్లిస్తారు? కంపెనీ వారు ప్రతీ సంవత్సరం ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించింది.

8వ తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం బైజూస్ వారు కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పింది. కానీ బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదు.

2. ఒకవేళ కంపెనీ వారు ఖర్చు భరించకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? AP ప్రభుత్వమా లేక విద్యార్థులా? ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో 750 కోట్లు బైజూస్ కంటెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది (ఒక్కో విద్యార్థికి 15 వేల చొప్పున * 5 లక్షల విద్యార్థులు = 750 కోట్లు)

3. 8వ తరగతి నుండి 9వ తరగతికి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? 9వ తరగతి కంటెంట్ ఖర్చు ఎవరు భరిస్తారు?

4. బైజూస్ సంస్థ వారు ఏ మాధ్యమంలో, ఏ సిలబస్ అందజేస్తారు? వారు ఏ విధానం ఆధారంగా సిలబస్ రూపొందిస్తున్నారు? CBSC/స్టేట్ సిలబస్ లేదా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్నారా?

జవాబు: CBSE సిలబస్ ఆధారంగా కంటెంట్ రూపొందించాం అని సంస్థ వారు పేర్కొన్నారు. అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు.

Read Also :  YSRCP : రామచంద్రాపురం వైస్సార్సీపీ లో భగ్గుమంటున్న అంతర్గత విభేదాలు..

Exit mobile version