Pawan Kalyan Tweet: పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్.. ఊపిరి తీసుకోవడం ఆపేయాలా అంటూ ఫైర్

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల కోసం వారాహి అనే వాహనాన్ని సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ చేస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా స్పందించారు. కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తొలుత మీరు నా సినిమాలు ఆపేశారు. విశాఖపట్నంలో నన్ను వాహనం నుండి, హోటల్ నుండి బయటకు రానీయలేదు. విశాఖ నుండి వెళ్లిపోవాలని బలవంతం చేశారు. మంగళగిరిలో […]

Published By: HashtagU Telugu Desk
Pawan

Pawan

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల కోసం వారాహి అనే వాహనాన్ని సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ చేస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా స్పందించారు. కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తొలుత మీరు నా సినిమాలు ఆపేశారు. విశాఖపట్నంలో నన్ను వాహనం నుండి, హోటల్ నుండి బయటకు రానీయలేదు. విశాఖ నుండి వెళ్లిపోవాలని బలవంతం చేశారు. మంగళగిరిలో నా కారును బయటికి రానివ్వలేదు, నన్ను నడవడానికి కూడా అనుమతించలేదు. ఇప్పుడు నా వాహనం రంగు మీకు సమస్యగా మారింది. సరే నేను ఇప్పుడు ఊపిరి తీసుకోవడం మానేయాలా? తర్వాత..’ అని పవన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పవన్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కోసం ప్రత్యేకంగా వాహనాన్ని సిద్ధం చేయించారు. వారాహిగా పిలవబడే ఈ వాహనం ట్రయిల్ రన్ హైదరాబాద్‌లో జరిగింది. వాహనం పక్కనే పవన్ ఉన్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. వారాహి అనే వాహనాన్ని సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ చేస్తున్న విమర్శలపై పవన్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

Also Read: Cyclone Mandus: తీవ్ర తుఫాన్ గా మాండూస్.. 3 రాష్ట్రాలకు అలర్ట్‌

 

  Last Updated: 09 Dec 2022, 09:48 AM IST