AP Poll : మోడీ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్

ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ శాలువా కప్పి .. అనంతరం మోడీ కాళ్లకు పవన్ నమస్కరించబోగా అందుకు ఆయన వద్దని నిరాకరించారు

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 04:39 PM IST

మరో వారం రోజుల్లో ఏపీలో ఎన్నికలకు (Ap Elections) శుభం కార్డు పడబోతోంది. మే 13 న అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీల అధినేతలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు తమదైన ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఓ పక్క సభలు , సమావేశాలు , రోడ్ షో లతో ఆకట్టుకుంటూనే ఇటు సోషల్ మీడియా ప్రచారం తో ఓటర్లను కట్టిపడేస్తున్నారు. ఈసారి టిడిపి , జనసేన , బిజెపి లు కలిసి కూటమి గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మోడీ (Modi) ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా..ఈరోజు మరోసారి ప్రజాగళం సభలో పాల్గొన్నారు. రాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. వేదికపై వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ ముఖ్యనేతలు, టీడీపీ నేత నారా లోకేష్‌ (TDP Leader Nara Lokesh) శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) కూడా ప్రధానికి సాదర స్వాగతం పలికారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ శాలువా కప్పి .. అనంతరం మోడీ కాళ్లకు పవన్ నమస్కరించబోగా అందుకు ఆయన వద్దని నిరాకరించారు. కాళ్లకు నమస్కారం పెట్టవద్దని జనసేనానికి చెబుతూ పవన్‌ను ప్రధాని ఆలింగనం చేసుకున్నారు. ఈ సీన్ చూసిన ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గౌరవం అంటే అది…తనకంటే పెద్దవారికి నమస్కరించడం పవన్ కళ్యాణ్ కు మాత్రమే చెల్లిందని..అందుకే పవన్ కళ్యాణ్ అంటే అందరికి ఇష్టం , అభిమానమని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో అయితే ఈ వీడియో ను తెగ వైరల్ చేస్తూ వస్తున్నారు.

Read Also : AP : ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా