Pawan Kalyan : నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్..?

  • Written By:
  • Publish Date - February 11, 2024 / 11:00 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈరోజు ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. పొత్తులపై బీజేపీ అధిష్ఠానంతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో పొత్తుల వ్యవహారం నడుస్తుంది. మొన్నటి వరకు టిడిపి – జనసేన మాత్రమే కూటమి గా ప్రజల్లోకి వెళ్లబోతుందని భావించారు..కానీ ఇప్పుడు బిజెపి కూడా పొత్తులో భాగం కాబోతుంది. ఇప్పటికే బిజెపి పెద్దలు టీడీపీ అధినేత చంద్రబాబు ను ఢిల్లీకి పిలిపించుకొని పొత్తుల ఫై చర్చలు జరిపారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పొత్తుల గురించి మాట్లాడబోతున్నారు. నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా కూడా
ఏపీలో పొత్తులు త్వరలో కొలిక్కి వస్తాయని వ్యాఖ్యలు చేసారు. దీంతో ఇప్పుడు పవన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల పర్యటన కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసారు. మొదటిరోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొంటారు. తదుపరి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాల్లో పాల్గొంటారు. పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నేతలతోనూ పర్యటనలో భాగంగా పవన్ భేటీ అవుతారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులతోనూ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరుపార్టీల నాయకులు శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల ఫలాల లక్ష్యంగా భేటీలు జరగనున్నాయి.

పవన్‌కళ్యాణ్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. తొలి దశలో ముఖ్య నాయకులతో సమావేశాలు ఉండనున్నాయి. రెండో సారి పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు కార్యకర్తలు, వీర మహిళల సమావేశాలలో పాల్గొననున్నారు. మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు, ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి పవన్‌ మూడు సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధమవుతోంది.

Read Also : Murali Mohan : మురళీమోహన్ లేకుండా ఎన్నికల ప్రచారమే లేదు – చంద్రబాబు