రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) తిరుపతి (Tirupati Assembly constituency) నుండి బరిలోకి దిగబోతున్నారా..? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక (Gajuwaka Constituency) , భీమవరం (Bhimavaram Constituency) నుండి పోటీ చేసి , రెండు స్థానాల్లో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా..రెట్టింపు ఉత్సహంతో ప్రజలకోసం పనిచేస్తూ ప్రజల మెప్పుపొందుతు వస్తున్నాడు. మరికొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఎన్నికలు తగ్గపోరు గా ఉండబోతున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అక్రమ కేసులో చంద్రబాబు ను అరెస్ట్ చేసి జైల్లో వేశారని యావత్ తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..బాబుకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో టీడిపి తో కలిసి పోటీ (TDP Janasena Alliance)చేయబోతున్నట్లు ప్రకటించి టిడిపి శ్రేణుల్లో ధైర్యం నింపారు. ప్రస్తుతం రెండు పార్టీలు కలిసి కార్యాచరణ చేపడుతూ వస్తున్నాయి. అయితే రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను తిరుపతి నుండి పోటీ చేయాలనీ చంద్రబాబు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబు (Chandrababu) ఈ స్థానం నుండి పోటీ చేయమని చెప్పడం వెనక ప్రత్యేక కారణం ఉందని అంటున్నారు. తిరుపతిలో కాపు కమ్యూనిటీకి చెందిన బలిజలు ఎక్కువ మంది ఉంటారు. ఇది పవన్‌కు అనుకూలంగా మారుతుందని చంద్రబాబు అంచనా వేశారు. 2009లో పవన్ సోదరుడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో పాలకొల్లు నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ ను తిరుపతి నుండి పోటీ చేయాలనీ చంద్రబాబు కోరారట.
పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే (Pawan Kalyan To Contest From Tirupati).. చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేసే టీడీపీ/ జనసేన నేతలకు కలిసి వస్తోందని చంద్రబాబు భావిస్తున్నారు. రాయలసీమలో కడపతోపాటు చిత్తూరులో వైసీపీ బలంగా ఉంది. పవన్ పోటీ చేయడంతో వారి ప్రాబల్యం తగ్గించొచ్చు అని చంద్రబాబు ప్లాన్. మరి చంద్రబాబు సూచనమేరకు పవన్ తిరుపతి నుండి పోటీ చేస్తారా..? నిజంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తిరుపతి నుండి పోటీ చేయమని సూచించారా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : Venkaiah Naidu : రాజకీయ నేతలు పార్టీలు మారడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు