Site icon HashtagU Telugu

Pawan Kalyan : భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ..ఫిక్స్ అయ్యినట్లే..!!

Pawan Bhimavaram

Pawan Bhimavaram

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈసారి ఏ నియోజకవర్గం నుండి పోటీ (Contest) చేస్తారనేది గత కొద్దీ రోజులుగా ఆసక్తి గా మారిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో భీమవరం , గాజువాక నుండి పోటీ చేసి , రెండు స్థానాల్లో ఓటమి చెందారు. ఇక ఇప్పుడు టీడిపి తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతుండడం తో ఆయన ఎక్కడినుండి పోటీ చేస్తారనేది చర్చగా మారింది. గాజువాక , భీమవరం , తిరుపతి , కాకినాడ ఇలా పలు నియోజకవర్గ పేర్లు చక్కర్లు కొట్టగా..ఫైనల్ గా మాత్రం పవన్ భీమవరం (Bhimavaram) నుండి బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించేసారు.

గత ఎన్నికల్లో పవన్ కు భీమవరంలో 62,285 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులుకు 54,037 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్ది గ్రంధి శ్రీనివాస్ కు 70,642 ఓట్లు రాగా.. ఆయన 8,357 ఓట్లతో విజయం సాధించారు. ఈ సారి టీడీపీ మద్దతుతో పోటీ చేయటం ద్వారా పవన్ గెలిచి అసెంబ్లీలో భీమవరం నుంచే అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అటు వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను సీఎం జగన్ ఖరారు చేసారు. దీంతో ఈసారి ఎలాగైనా గ్రంధిని ఓడించాలని పవన్ ఫిక్స్ అయ్యాడు. గత ఎన్నికల్లో స్వల్ప ఆటలతో గ్రంధి గెలవడం తో..ఈ సారి టీడీపీ, జనసేన కలవటం ద్వారా పవన్ గెలుపు ఖాయమని అంత విశ్లేషిస్తున్నారు.

అయితే, పవన్ పైన విజయం ఈ సారి వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. భీమవరం వచ్చిన పవన్ కల్యాణ్ తాజాగా జిల్లా టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. తాను భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు స్పష్టత ఇచ్చిన ఆయన..టీడీపీ నేతలు సహకరించాలని కోరారు. జిల్లా నేతలు తాము పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పవన్ కోసం ఓ మంచి వాస్తు ఉన్న ఇంటిని వెతికే పనిలో జనసేన – టిడిపి నేతలు బిజీ అయ్యారు. అతి త్వరలో పవన్ తన ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారు.

Read Also : Anil Kumar Yadav : తల తెగుతుందన్నా సరే.. జగనన్న కోసం వెనకడుగు వెయ్యను – అనిల్