Pawan Campaign: మార్చి 27 నుంచి ప్రచార బరిలోకి పవన్

ఆంద్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ గెలుపు కోసం ఎన్నికల ప్రచార వ్యూహాలను ముమ్మరం చేస్తున్నాయి.

Pawan Campaign: ఆంద్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ గెలుపు కోసం ఎన్నికల ప్రచార వ్యూహాలను ముమ్మరం చేస్తున్నాయి. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెలాఖరులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఈ నెల 27న జనసేన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుందని, పవన్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాలని యోచిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో వారాహిపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన పవన్.. ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలపై విమర్శలు చేయడంపైనే దృష్టి సారించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టి తొలి విడతలో పది నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూనే టీడీపీ, బీజేపీలతో కలిసి సంయుక్త సమావేశాల్లో పాల్గొంటారు.

రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని ప్రకటించారు అక్కడ ఆయన తన ప్రయత్నాలను ప్రచారం వైపు మళ్లించనున్నారు. మొత్తమ్మీద రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనకు మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు పిఠాపురంలో పవన్ ని ఓడించాలని అధికార పార్టీ వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. వంగ గీతను నిలబెట్టి పవన్ పై మహిళా పోటీ అంటూ ప్రచారం కల్పిస్తుంది.

Also Read: Wine Shops : వైన్ షాపులను లూటీ చేసిన మహిళలు..