Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్డీయే కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రి పదవి చేపట్టాలని జనసేన నేతలు కోరుకుంటున్నారు. అటు జనసేన కార్యకర్తలు సైతం ఇదే ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు సమాచారం

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి వంగగీతపై 70 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 175 మంది సభ్యులున్న సభలో జనసేనకు 21 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే 164 అసెంబ్లీ స్థానాల మెజారిటీతో ఘనవిజయం సాధించింది. కూటమిలో భాగంగా టీడీపీ-135 సీట్లు గెలుచుకుంది. అలాగే జనసేన 21 మంది, బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలతో అసెంబీలో అడుగుపెట్టనున్నాయి. ఇదిలా ఉండగా ఏపీలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో మంత్రుల అంశం హాట్ టాపిక్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్డీయే కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రి పదవి చేపట్టాలని జనసేన నేతలు కోరుకుంటున్నారు. అటు జనసేన కార్యకర్తలు సైతం ఇదే ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం అయితేనే బాగుంటుందని పవన్ అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఆ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కాగా జనసేన తెనాలి శాసనసభ్యుడు ఎన్ మనోహర్ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌గా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించగా, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. ఇక ఈ రోజు పార్టీ సభలో తమ నాయకుడిగా చంద్రబాబు నాయుడును ఎన్నుకునేందుకు ఎన్డీయే శాసనసభ్యుల సమావేశం జరిగింది. ఈ సభలో చంద్రబాబు నాయుడును సభాపతిగా ఎన్నుకున్నారు. దీనికి జనసేన పూర్తి మద్దతు ఇచ్చింది. కాగా రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Also Read: Parliament Session : జూన్ 24 నుంచి పార్లమెంటు సమావేశాలు.. స్పీకర్ ఎవరో ?

  Last Updated: 11 Jun 2024, 03:23 PM IST