Pawan Kalyan Take Oath : కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని

Published By: HashtagU Telugu Desk
Pawan

Pawan

జనసేన శ్రేణులు , మెగా అభిమానులు , మెగా ఫ్యామిలీ , చిత్రసీమ ఇలా యావత్ ప్రజానీకం ఎదురుచూస్తున్న..వినాలకుంటున్న మాట కు , ఎదురుచూపులు తెరపడింది. ‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని’ అంటూ పవన్ నోటా వినిపించి అందరి కోరిక తీరింది. జనసేన పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత మొదటి సారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ లో అడుగుపెడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం లో కీలక పాత్ర పోషించడమే కాదు బరిలో నిల్చున్న తన పార్టీ సభ్యులు 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ బరిలో విజయం సాధించి 100 % విజయం తో చరిత్రలో నిలిచారు. ఇక ఈరోజు ప్రధాని మోడీ సమక్షంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు.

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆయన సతీమణి అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు, మోడీ ల వద్దకు వెళ్లిన పవన్ కల్యాణ్ వారితో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు. ఆపై వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులకు పవన్ కల్యాణ్ నమస్కరించారు. సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

Read Also : Jayaho Andhra Matha : సీఎంగా చంద్రబాబు ప్రమాణం.. ‘‘జయహో ఆంధ్రమాత’’ పాట వైరల్

  Last Updated: 12 Jun 2024, 12:17 PM IST