Pawan Kalyan : వాలంటీర్ వ్యవస్ద అసలు అవసరం లేదు.. మళ్ళీ మళ్ళీ.. వాలంటీర్ల గురించే మాట్లాడుతున్న పవన్..

తాజాగా తణుకు జనసేన నాయకులతో సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ మళ్ళీ వాలంటీర్ల గురించి మాట్లాడారు. ఈ సారి మాత్రం ఏకంగా అసలు వాలంటీర్ల వ్యవస్థే అవసరం లేదు అన్నారు.

  • Written By:
  • Publish Date - July 13, 2023 / 08:00 PM IST

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర(Varahi Yatra) రెండో షెడ్యూల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా ఇటీవల ఏలూరు(Eluru)లో భారీ బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా సమాచారం కలెక్ట్ చేసి అధికార ప్రభుత్వానికి చెందిన కొందరు వుమెన్ ట్రాఫికింగ్(Women Trafficking) కి పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ(YCP) నాయకులు, వాలంటీర్లు పవన్ పై ఫైర్ అవుతూనే ఉన్నారు.

పవన్ కళ్యాణ్ మాత్రం రోజూ మళ్ళీ మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. తాము వాలంటీర్లను అనలేదని, వాళ్ళ దగ్గర డేటాని తీసుకొని తప్పుడు పనులు చేసేవాళ్ళని అంటున్నామని జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అంటున్నారు. మూడు రోజుల నుండి అటు వైసీపీ, ఇటు జనసేన నాయకులు వాలంటీర్ల వ్యవస్థ గురించి మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై పవన్ కళ్యాణ్ కి ఏపీ మహిళా కమీషన్(AP Women’s Commission) నోటీసులు ఇచ్చింది. పలు చోట్ల పవన్ కళ్యాణ్ పై కేసులు నమోదు చేశారు.

ఇంత జరుగుతున్నా పవన్ మళ్ళీ మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ గురించే మాట్లాడుతున్నారు. పవన్ చెప్పేది నిజమా, అబద్ధమా అనేది పక్కన పెడితే ఓ పక్క రాష్ట్రంలో పవన్ వ్యాఖ్యలపై రచ్చ జరుగుతుంటే ఇంకా అదే టాపిక్ మాట్లాడటం మరింత రచ్చగా మారుతుంది. తాజాగా తణుకు జనసేన నాయకులతో సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ మళ్ళీ వాలంటీర్ల గురించి మాట్లాడారు. ఈ సారి మాత్రం ఏకంగా అసలు వాలంటీర్ల వ్యవస్థే అవసరం లేదు అన్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. రోజు రోజుకు మహళలకు భయం‌ పెరుగుతుంది. నేను నా కోసం పోరాటం చేయడం లేదు. నిస్సహాయతలో ఉన్న ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాను. వాలంటీర్లకు మన పర్సనల్ సమాచారాన్ని ఎందుకు ఇవ్వాలి. వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు ప్రజలకు సేవలు అందలేదా? ప్రజాస్వామ్యానికి జగన్ తూట్లు పొడుస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్ద అసలు అవసరం లేదు. రోజుకు 164 రుపాయలు ఇచ్చి యువతను, వారిలోని శక్తిని నాశనం చేస్తున్నాడు. వాలంటీర్లలోని టాలెంట్ స్కిల్స్ సద్వినియోగం చేసుకోవాలి. జగన్ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారు. మన దగ్గర సమర్థత ఉంది కాబట్టే దేశ ప్రధాని నాకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. జనసేనకు బలమైన, దృడమైన సంకల్పం ఉంది. ప్రతి ఒక్కరు సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు.

అయితే అసలు వాలంటీర్ వ్యవస్థే అవసరం లేదు అని పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో ఈ సారి డైరెక్ట్ గా వాలంటీర్లు రంగంలోకి దిగేలా పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు వైసీపీ నాయకులు వాలంటీర్ల వెనకుండి పవన్ పై మాట్లాడించినా ఇప్పుడు చేసిన వ్యాఖ్యలతో వాలంటీర్లు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఈ వాలంటీర్ రచ్చ ఎప్పుడు ఆగుతుందో చూడాలి మరి.

 

Also Read : Pawan Kalyan: వాలంటీర్లపై వివాదస్పద వ్యాఖ్యలు, పవన్ పై కేసు నమోదు