ఏపీ రాజకీయాలు (AP Politics) మళ్లీ వేడెక్కుతున్నాయి. గత రెండు వారాలుగా తిరుమల లడ్డు (Tirumala Laddu Issue) ఇష్యూ పై పెద్ద వివాదం కొనసాగగా..సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేయడం తో ఇక సైలెంట్ అయినట్లే అని అంత అనుకుంటున్నారు..ఇదే సందర్బంగా రేపు వారాహి సభ (Varahi Sabha) లో పవన్ కళ్యాణ్ ఏమాట్లాడతారో (Pawan Kalyan Speech at Varahi Sabha) అనే ఉత్కంఠ నెలకొంది. తిరుపతిలో గురువారం నిర్వహించే వారాహి సభ వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ట్విట్టర్ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయాశ్చిత దీక్షను విరమించిన తర్వాత వారాహి డిక్లరేషన్ గురించి వివరించారు. తిరుపతిలో వారాహి సభను సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు అంకితం చేయనున్నట్లు పవన్ తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకునే లక్షలాది మంది స్వరాలను ప్రతిధ్వనించడమే లక్ష్యంగా వారాహి సభను నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
మరి వారాహి డిక్లరేషన్‌లో పవన్ కళ్యాణ్ ఏం రాశారు ? పవన్ కల్యాణ్ సభలో ఏం చెప్పనున్నారు ? సనాతన ధర్మ పరిరక్షణ కోసమే పవన్ కళ్యాణ్ కదిలాడా ? గత ప్రభుత్వ తప్పులను పరిష్కరించడమే ఆయన ఎజెండానా ? అసలు కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటి ? హిందుత్వ ఎజెండాలో జనసేన ఒంటరిగానే ముందుకుపోతోందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు అందరిలో కలుగుతున్నాయి. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హైందవ మతాన్ని, దేవుళ్లను రాజకీయాలకు వాడుకోకుండా.. దేవాలయాల నిర్వహణ, పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా వినిపిస్తోంది. దీనికోసం పలువురు స్వామీజీలు ప్రభుత్వాలకు విన్నవించినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన ప్రజల సహకారంతో ఈ డిమండ్‌ను తెరపైకి తీసుకువచ్చింది. హైందవ సంఘాలు సైతం పవన్ కళ్యాణ్ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం నాటి వారాహి సభలో పవన్ కళ్యాణ్ ఎలాంటి విషయాలు మాట్లాడబోతున్నారు.. డిక్లరేషన్‌లో ఏమి పొందుపర్చారనేది ఆసక్తికరంగా మారింది.
తిరుమల లడ్డు అపవిత్రమైందని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈరోజు శ్రీవారి సన్నిధానంలో దీక్షను విరమించారు. మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కూతుళ్లు కుమారి ఆద్య కొణిదెల, కుమారి పొలెనా అంజలి కొణిదెలలతో కలసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు జరుగుతున్న అన్నదాన సరళిని పరిశీలించారు. అనంతరం సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. వారాహి డిక్లరేషన్ బుక్‌ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. వారాహి డిక్లరేషన్ బుక్‌ను ఆలయం వెలుపల మీడియాకు చూపించారు. బుధవారం వారాహి సభలో బుక్‌లోని అంశాలను పవన్ కల్యాణ్ ప్రజలకు వివరించనున్నారు.
Read Also : Konda Surekha Comments : దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి – చైతు