Pawan Kalyan : పవన్ తగ్గలేదు జస్ట్ గ్యాప్ ఇచ్చాడంతే..మిగతాదంతా సేమ్ టూ సేమ్

వైసీపీ నేతల్లారా... మీ బతుక్కి ఏ రోజైనా మీ జేబులోంచి ఒక్క రూపాయి బయటికి తీశారా

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 11:05 AM IST

జనసేన శ్రేణులంతా ఇలాగే మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం 4 వ విడత వారాహి యాత్ర (Varahi yatra) చేపట్టిన సంగతి తెలిసిందే. అవనిగడ్డ లో మొదలైన ఈ యాత్ర నిన్న కైకలూరు నియోజకవర్గంకు చేరుకుంది. టీడీపీ పొత్తు తర్వాత ఫస్ట్ టైం జనసేనాని ప్రజల్లోకి వచ్చాడు. దీంతో పవన్ యాత్ర కు జనసేన శ్రేణులతో పాటు టీడీపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. కాగా పవన్ అవనిగడ్డ (Avanigadda) సభలో జగన్ ఫై పెద్దగా విమర్శలు చేయకపోయేసరికి..సోషల్ మీడియా లో పవన్ ఫై అనేక విమర్శలు , కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ భయపడ్డాడని, ఎక్కడ కేసులు పెట్టి జైల్లో వేస్తారో అని , చంద్రబాబు కు లాగా తనకు కూడా బెయిల్ రాకుండా చేస్తారో అని భయపడి..పవన్ పెద్దగా విమర్శలు చేయలేదని వైసీపీ అనుచరులు ప్రచారం చేసారు. కానీ ఆ తర్వాత పెడన సభ , నిన్న ముదినేపల్లి  (Mudinepalli )సభ లో వైసీపీ ఫై ఎప్పటిలాగానే దూకుడు చూపించాడు పవన్. కేవలం జగన్ పైనే కాదు వైసీపీ నేతలపై , మంత్రుల ఫై ఇలా అందరిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.

మేం ఎన్డీయేలో ఉంటే నీకేంటి, లేకపోతే నీకేంటి?

151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీల బలం ఉన్న పార్టీ వైసీపీ… ఏ పదవి లేని, కేవలం జనసైనికుల బలం ఉన్న పార్టీ జనసేన పార్టీ అని పవన్ ఉద్ఘాటించారు. తాము ఎవరికీ భయపడబోమని, ఈరోజు టీడీపీ వాళ్లకు కూడా మేమున్నాం అనే బలాన్ని అందించామని చెప్పుకొచ్చారు. ‘ఎన్డీయే కూటమి నుంచి మేం బయటికి వచ్చేశాం అని విమర్శిస్తున్నారు. మేం ఎన్డీయేలో ఉంటే నీకేంటి, లేకపోతే నీకేంటి? పథకాలకు డబ్బులు ఇస్తూ కూడా మాకు భయపడుతున్నారంటే దానర్థం ఓడిపోతున్నారనే! మీరు ఇంకా భయపడాలి’ అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

వైసీపీ నేతల్లారా… మీ బతుక్కి ఏ రోజైనా మీ జేబులోంచి ఒక్క రూపాయి బయటికి తీశారా?

భారతి సిమెంట్స్, సాక్షి మీడియా సంస్థను కలిగివున్న మీరు కూడా క్లాస్ వార్ గురించి మాట్లాడతారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్, వైసీపీ నేతల్లారా… మీ బతుక్కి ఏ రోజైనా మీ జేబులోంచి ఒక్క రూపాయి బయటికి తీశారా? ప్రజల కోసం ఖర్చు పెట్టారా? అని ప్రశ్నించారు. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును కౌలు రైతుల కోసం ఖర్చు చేస్తున్నానని పవన్ కల్యాణ్ గర్వంగా తెలిపారు. వైసీపీ నేతల దృష్టిలో ఎవరూ ఎవరినీ పొగడకూడదని, అవతలి వ్యక్తి ఎంత గొప్పవాడు అయినా ఈ వైసీపీ నేతలు అతడిని తిడతారని పవన్ వెల్లడించారు. వైసీపీ నేతలు ఆఖరికి రజనీకాంత్ ను కూడా వదల్లేదని, ఆయనను కూడా తిట్టారని పవన్ సభ ముఖంగా చెప్పుకొచ్చారు. జగన్ ను పంపించే సమయం వచ్చేసిందని, ఇక జగన్ కు టాటా చెప్పేద్దాం అని పిలుపునిచ్చారు.

టీడీపీ నేతలు కూడా అర్ధం చేసుకోవాలి

టీడీపీ నేతలు అర్థం చేసుకోవాలి. మేం మీకు స్నేహ హస్తం అందించాం. మీరు కూడా అదే విధంగా మా వాళ్లతో స్నేహంగా ఉండండి. గతంలో గొడవలు పక్కనబెట్టండి. చంద్రబాబుతో విభేదాలు ఉన్నప్పటికీ నేను రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయనను కలిశాను. 2014లో నేను టీడీపీకి అండగా నిలిచినప్పుడు, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ రోజూ కూడా నా వల్లనే గెలిచింది అని చెప్పలేదు. నేను అన్నది ఏంటంటే… మేం మద్దతు ఇచ్చాం, ఏం ఆశించలేదు… ఒక్క ఓటు మా వల్ల పడినా దానికి కృతజ్ఞత అనేది ఉండాలని పవన్ చెప్పుకొచ్చారు.

పవన్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసాడు..

సభలో పవన్ ప్రసంగిస్తుండగా మసీదు నుంచి నమాజ్ వినవచ్చింది. దాంతో ఆయన తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అనంతరం కొనసాగిస్తూ, మసీదు నుంచి నమాజ్ వస్తే ప్రసంగం ఆపమని నా సనాతన ధర్మం నేర్పింది అని వెల్లడించారు. భారత్ ఎంతో పవిత్రమైన నేల అని, ఎప్పటికీ ఇతర మతాలపై దాడులు చేయాలని ప్రేరేపించదని స్పష్టం చేశారు. జనసేన అన్ని మతాలను గౌరవిస్తుందని, అందుకే నా మతం గురించి, ఇతర మతాల గురించి బలంగా మాట్లాడగలనని వివరించారు. తాను ప్రజలందరినీ తన సొంత కుటుంబంలా, సొంత అన్నదమ్ముళ్లు, సొంత అక్కచెల్లెళ్లలా చూస్తానని ఉద్ఘాటించారు. కులాల వారీగా ఎప్పుడూ చూడబోనని అన్నారు.

Read Also : SI Hall Tickets : ఎస్సై తుది పరీక్షల హాల్‌టికెట్లు రిలీజ్.. లాస్ట్ డేట్ అక్టోబరు 12