Pawan Kalyan : దివిసీమ పౌరుషం ఏంటో ఎన్నికల్లో చూపించడండి – పవన్ కళ్యాణ్

చొక్కా విప్పడం కాదు, ఇది సరిపోదు... ఓట్లేయించు... ప్రభుత్వాన్ని మార్చు, రౌడీయిజాన్ని ఎదుర్కో, గూండాగిరీని కాలితో నలిపేయ్... అప్పుడు చొక్కా విప్పు (ఓ యువకుడ్ని ఉద్దేశించి). అదీ దమ్ము, అదీ తెగింపు... దివిసీమ పౌరుషం ఏంటో చూపించి అంటూ అతడిలో పౌరుషం నింపారు

Published By: HashtagU Telugu Desk
Pawan Avanigadda

Pawan Avanigadda

మాములుగా సినిమాల్లో హీరోలు చెప్పే డైలాగ్స్ వింటుంటే రోమాలు నిక్క పొడుస్తుంటాయి..అలాంటిది ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పవన్ చెప్తున్నా మాటలు వింటుంటే సభలోని ప్రజలకే కాదు సోషల్ మీడియా లో ఆ మాటలు విన్నవారికి సైతం రోమాలు నిక్క పొడుస్తున్నాయి. ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలని కొనసాగిస్తున్నారు. గత నెల వరకు పవన్ ప్రసంగాలు వేరు..ఇప్పుడు వేరేలా ఉన్నాయి. ఎక్కడిక్కడే జగన్ మోసాలను , ఐదేళ్లలో ప్రజలకు చేసిన అన్యాయాన్ని అర్థమై రీతిలో చెపుతూ ఆకట్టుకుంటున్నారు. ఈరోజు అవనిగడ్డ లో కూడా సభలో ప్రజలను ఉద్దేశించి పవన్ ఓ రేంజ్ లో ప్రసంగించారు. ఇదే సందర్భంగా ఓ యువకుడు చొక్కా చించుకొని పిరికిలి బిగించి ఉండడం చూసి..పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

గుండె బలం ఉంది మాకు… ఎవరిని బెదిరిస్తారు? దమ్ము ధైర్యం లేకపోతే బతకలేని ఈ సమాజంలో జగన్ ఎంత, జగన్ బతుకెంత? ఏం తప్పు చేశామని జగన్ కు, జగన్ ఎమ్మెల్యేలకు భయపడాలి? రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించలేదా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మన బతుకులు నలిపేస్తాడా? చొక్కా విప్పడం కాదు, ఇది సరిపోదు… ఓట్లేయించు… ప్రభుత్వాన్ని మార్చు, రౌడీయిజాన్ని ఎదుర్కో, గూండాగిరీని కాలితో నలిపేయ్… అప్పుడు చొక్కా విప్పు (ఓ యువకుడ్ని ఉద్దేశించి). అదీ దమ్ము, అదీ తెగింపు… దివిసీమ పౌరుషం ఏంటో చూపించి అంటూ అతడిలో పౌరుషం నింపారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, క్రికెటర్ అంబటి రాయుడు ఇద్దరూ వైసీపీ నుంచి బయటికి వచ్చేసిన వాళ్లేనని, వారు నిజంగా జగన్ ను నమ్మారని, అలాంటి వాళ్లే వైసీపీని వదిలి వచ్చేశారంటే అందరూ ఆలోచించాలని అన్నారు. బాలశౌరి గతంలో వైఎస్ వద్ద పనిచేసిన వ్యక్తి అని, తండ్రిని నమ్మిన వ్యక్తి కొడుకును కూడా నమ్మారని, రాయుడు కూడా అంతేనని… వారు చెప్పే దాన్ని బట్టి వైసీపీలో వ్యక్తులు అవసరం లేదు, వారికి బానిసలు మాత్రమే అవసరం అని పవన్ పేర్కొన్నారు.

Read Also :  Terrorists Attack : ఎన్నికల వేళ రెచ్చిపోయిన ఉగ్రవాదులు..ఎయిర్ ఫోర్స్ వాహనంపై దాడి

  Last Updated: 04 May 2024, 10:45 PM IST