Site icon HashtagU Telugu

Pawan Kalyan : ‘ఎప్పటికీ మారని మనిషి’ అంటూ పవన్ ఫై స్పెషల్ వీడియో

Pawan Spl Video

Pawan Spl Video

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై ఉగాది (Ugadi ) పర్వదినాన స్పెషల్ వీడియో రిలీజ్ చేసి అభిమానులను , జనసేన శ్రేణులను ఆకట్టుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు (Nagababu). ‘ఎప్పటికీ మారని మనిషి’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘పంచభక్ష పరమాన్నాలు చేతికందినా.. ఆ గొంతులోకి ముద్ద దిగలేదు. సకల సౌకర్యాలు చెంతకే చేరాయి.. అయినా ఆ కంటికి కునుకు పట్టలేదు. రంగుల ప్రపంచపు రారాజు గుండెల్లో చిమ్మచీకటి కాచింది. అందుకే భగ భగమండే జ్వాలై లేచాడు. భూమి పుత్రుల భుజంకాచాడు. ఆడబిడ్డల ఆప్తుడయ్యాడు’ అంటూ వీడియోలో పవన్ కళ్యాణ్ ఇంట్రో ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ కల్యాణ్ కు సంబంధించిన జీవిత కాల జర్నీని ఈ వీడియోలో పంచుకున్నారు. ఓ మహిళ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్‌కు పవన్ లైఫ్ జర్నీని చూయించారు. మొత్తం 4.31 నిమిషాల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి బిజెపి, టీడీపీ పార్టీలతో కలిసి బరిలోకి దిగబోతుంది. 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా..పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే పవన్ తన నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. అంతే కాదు ఈరోజు గొల్లప్రోలు బైపాస్‌లోని పార్టీ కార్యకర్తకు చెందిన భవనంలో గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అక్కడే పూజలు నిర్వహించి, ఉగాది వేడుకలు, పంచాగ శ్రవణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటె తాజాగా జనసేన కీలక నేత పోతిన మహేష్ పార్టీ కి గుడ్ బై చెపుతూ..పవన్ కళ్యాణ్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అందుకే నాగబాబు పవన్ వ్యక్తిత్వం ఫై ఓ వీడియో రిలీజ్ చేసి..మహేష్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మీరు కూడా నాగబాబు షేర్ చేసిన వీడియో ఫై లుక్ వెయ్యండి.

Read Also : Chandrababu : ఉగాది పర్వదినాన వాలంటీర్లకు చంద్రబాబు తీపి కబురు