ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) పవనోవిచ్ సింగపూర్(Singapore)లోని ఒక స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident)లో గాయపడిన విషయం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని, పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అస్వస్థతకు గురయ్యాడని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్కూల్ సిబ్బంది అతనిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనలో 15 మంది చిన్నారులు సహా మొత్తం 19 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.
Cooking Oil: వాడిని నూనెను మళ్ళీ మళ్ళీఉపయోగిస్తున్నారా.. అయితే ఇది ఎంత డేంజర్ లో తెలుసా?
ప్రమాద వార్త తెలియగానే పవన్ కళ్యాణ్ తన అరకు పర్యటనలో ఉండగా అధికారులు, నేతలు వెంటనే సింగపూర్ వెళ్లాలని సూచించారు. అయితే గిరిజనులతో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, మొదట అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి వెళ్లతానని పవన్ స్పష్టం చేశారు. ఆయన కురుడి గ్రామాన్ని సందర్శించి, గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని, సుంకరమెట్ట కాఫీ తోటల వద్ద చెక్క వంతెనను ప్రారంభించిన తర్వాతే సింగపూర్ కు బయలుదేరనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం పవన్ సింగపూర్ కు వెళ్లనున్నారు.
పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నేవా సింగపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె మాస్టర్ డిగ్రీ కోసం అక్కడ ఉంటూ, కుమారుడిని రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్‌లో చదివిస్తున్నారు. ఈ స్కూల్‌లోనే ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై స్పందిస్తూ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జనసేన అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా సోషల్ మీడియాలో మార్క్ శంకర్ ఆరోగ్యంగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.