నామినేషన్ (Nomination) పర్వం ముగిసిన దగ్గరి నుండి పవన్ కళ్యాణ్ లో జోష్ పెరిగింది. ఓ పక్క జగన్ (Jagan) ఫై విమర్శలు కురిపిస్తూనే..తన కోసం వచ్చిన అభిమానుల కోసం హీరోల మారుతూ తమ ఆట , పాటలతో వారిలో హుషారు తెప్పిస్తున్నారు. ఇది చూసిన అభిమానులు కేరింతలు కొడుతూ..పవన్ లో మరింత జోష్ పెంచుతున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ వారంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ… జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఇక చాలు, ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని .. వచ్చే ఎన్నికల్లో మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండని ఓటర్లను కోరారు. ఈ జగన్ ప్రభుత్వంలో దేనికోసం ప్రశ్నించకూడదని..ప్రశ్నిస్తే కేసులు పెడతారని మండిపడ్డారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ రాలేదని అడిగితే కొట్టారని గుర్తుచేశారు. కన్నబాబును కన్నాల బాబుగా అభివర్ణించిన పవన్ కల్యాణ్, కన్నబాబు లేఅవుట్‌లు వేసి భూములు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.
తాను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలన్న పవన్, ప్రజల కోసం ముఠా కూలీలా పనిచేస్తానని పేర్కొన్నారు. మానవహక్కుల ఉల్లంఘన జరిగితే పోరాడుతానని వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో తొలిసారి నైపుణ్య గణాంకాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 9 గంటల ఉచిత్ విద్యుత్ ఇస్తామన్నారు. వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందిస్తామని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. కౌలు రైతులకు గుర్తింపుకార్డులు అందజేస్తాం, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని పవన్ హామీ ఇచ్చారు. ఇదే సందర్బంగా తనలోని గాయకుడ్ని బయటకు తీసుకొచ్చారు. తన సినిమాల్లోని పాటలే కాకుండా విప్లవ గీతాలు , శ్రీకాకుళం ఫోక్ సాంగ్స్ పాడి అభిమానుల్లో , కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
Vibing with crowd 😍#VarahiVijayaBheri pic.twitter.com/v3TVZJVezJ
— Scorpio (@Scorpion_JSP) May 1, 2024
Read Also : Big Shock To BRS : కాంగ్రెస్ లో చేరిన ఇంద్రకిరణ్ రెడ్డి