Site icon HashtagU Telugu

AP Elections 2024: కృష్ణ ఎన్టీఆర్ కి సపోర్ట్ చేయలేదు: పవన్ కళ్యాణ్

AP Elections 2024

AP Elections 2024

AP Elections 2024: ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఎవరంటే మొదట సూపర్ స్టార్ కృష్ణ పేరు చెప్తారు. సినీ హీరోగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. కాగా మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీతో కలిసి నిర్వహించిన ర్యాలీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..సీనియర్ ఎన్టీఆర్ సినిమా, రాజకీయంగా ఉన్నత పదవుల్ని అనుభవించారు. అయితే రాజకీయంగా అందరు నటులు ఆయనకు మద్దతు ఇవ్వలేదు. పలువురు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. కృష్ణ కాంగ్రెస్‌లో, ఇతర నటులు మరో రాజకీయ పార్టీలో ఉన్నారు. కానీ ఎన్టీఆర్, కృష్ణ రాజకీయంగా ఏనాడూ విమర్శలు చేసుకోలేదని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. అలాంటిది ఏ రాజకీయ విబేధాలు లేకున్నా జగన్ హీరోలందరినీ అగౌరవపరిచాడు అంటూ పవన్ వ్యాఖ్యానించాడు. అయితే చాలా మంది నెటిజన్లు పవన్ వ్యాఖ్యలపై భిన్నంగా స్పందిస్తున్నారు.

We’re now on WhatsAppClick to Join

పవన్ కళ్యాణ్ కృష్ణపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ పార్టీ స్పందించింది. రోజుకో పార్టీ జెండా మోసే నువ్వు హీరో సూపర్ స్టార్ కృష్ణ కాలి గోటికి కూడా సరిపోవు అంటూ హాట్ కామెంట్స్ చేసింది వైసీపీ. టీడీపీ నాయకులు నీ తల్లిని నీచాతినీచంగా మాట్లాడారని ఏడ్చిన విషయం మర్చిపోయావా?, ఎన్టీఆర్ గారిపై చెప్పులు వేసిన ఊసరవెల్లితో జతకట్టావ్.. అవసరం తీరాక నీపైనా చెప్పులు వేయించడం ఖాయం అంటూ వైసీపీ తన సోషల్ మీడియాలో ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది.

Also Read: Harish Rao: ఇందిరాగాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన హరీశ్ రావు