ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Ex MLA Prasanna Kumar Reddy) తన మాటలతో మరో వివాదానికి తెరతీశారు. ఆయన అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర స్థాయిలో వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Serious Warning) తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR : కేటీఆర్.. దమ్ముంటే నీ అయ్యను అసెంబ్లీకి తీసుకురా – అద్దంకి దయాకర్
పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మహిళలపై అసభ్యంగా మాట్లాడడం వైసీపీ నేతలకు అలవాటైపోయిందని మండిపడ్డారు. ప్రశాంతిరెడ్డి వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిందనీయమైనవని, మహిళల గౌరవానికి ఇది బహిరంగ అవమానమని పేర్కొన్నారు. రాజకీయాల్లో వివేచన ఉండాల్సిన సమయంలో ఇలా వ్యక్తిగత స్థాయికి దిగజారడం వైసీపీ నీచ రాజకీయం చేస్తున్నదానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఇటీవల కాలంలో వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ఓ పరంపర కొనసాగిస్తున్నారని పవన్ ఆరోపించారు. “పలు మార్లు హెచ్చరించినా, తమ భాషను మార్చుకోవడం లేదంటూ వైసీపీ నేతలు కావాలని అరాచకంగా ప్రవర్తిస్తున్నారు” అని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వైఖరిని కొనసాగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని స్పష్టంచేశారు.
Nitish Kumar : బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన
ఇలాంటి వ్యవహారాలు రాష్ట్రంలోని మహిళల మనోభావాలను దెబ్బతీయడం తప్ప మరొకటి కాదని పవన్ అన్నారు. మహిళలే వైసీపీకి గట్టిగా బుద్ది చెబుతారని హెచ్చరించారు. రాజకీయాల్లో మర్యాద, గౌరవం అవసరమన్న ధర్మబద్ధమైన పిలుపు ఇస్తూ – ఇటువంటి వ్యాఖ్యల పట్ల నిరసనగా వ్యవహరించాలని సమాజానికీ పిలుపునిచ్చారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శల దూకుడు కొనసాగుతోంది.