Tirupati Laddu Controversy : తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకు మరింత ఎక్కవుతుంది. దీనిపై దేశ వ్యాప్తంగా రగడ నడుస్తుంది. తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్తులో మళ్లీ జరగకుండా NDA ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హామీ ఇచ్చారు. ‘దీనిపై CBIతో విచారణ జరిపించడంపై క్యాబినెట్లో చర్చిస్తాం. దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరుతున్నా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుందన్నారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి. దోషులను శిక్షించాలి’ అని అన్నారు.
తిరుమలలోలాగా ఎక్కడ ఏ తప్పు జరిగినా హిందువులంతా బయటకు వచ్చి మాట్లాడాలని పవన్ పిలుపునిచ్చారు. మనకెందుకులే అని ఊరుకుంటే ఇలాంటివే జరుగుతాయని అన్నారు. ‘స్వామికి అపవిత్రం జరుగుతుంటే తిరుమలలో పనిచేసే సిబ్బంది ఎందుకు కామ్ గా ఉన్నారు..? వైసీపీకి భయపడ్డారా? ప్రతీ హిందువు మతాన్ని గౌరవించాలి’ అని వ్యాఖ్యానించారు. ఈ నెయ్యితో చేసిన లడ్డూలను అయోధ్యకు పంపడం దారుణమని అన్నారు.
తిరుమలలో జరిగినట్లు చర్చి/మసీదులో ఏదైనా అపవిత్రత చోటుచేసుకుంటే దేశమంతా అల్లకల్లోలం చేసేవారని, ప్రపంచమంతా తెలిసేదని పవన్ అన్నారు. ‘మేము అన్ని మతాలను గౌరవిస్తాం. కానీ ఈ వివాదంపై మాట్లాడొద్దంటే ఎలా? దీని వల్ల కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదే చర్చి/మసీదులో జరిగితే మాజీ సీఎం జగన్ ఊరుకుంటారా? దోషులను ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ‘ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
మరోపక్క ఈ లడ్డూ వ్యవహారంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం ఆందోళనకరం. ఇది లోపం కాదు. విశ్వాసాన్ని దెబ్బతీసినట్లే. హిందువులను అవమానపరిచారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉంది. సంప్రదాయాల ఉల్లంఘనలను సహించబోమని మనం ఒక ఉదాహరణగా నిలవాలి’ అని ట్వీట్ చేశారు.
Read Also : Hydraa : హైడ్రా కూల్చివేతలు..సామాన్య ప్రజల రోదనలు