Site icon HashtagU Telugu

AP : పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..రేపు పెడన సభలో రాళ్ల దాడికి జగన్ కుట్ర..

Pawan Kalyan comments on alliance for next governments and CM Post

Pawan Kalyan comments on alliance for next governments and CM Post

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్..4 వ విడుత వారాహి యాత్ర (Varahi yatra) లో బిజీ గా ఉన్నారు. అవనిగడ్డ లో మొన్న భారీ బహిరంగ సభ తో వారాహి యాత్ర చేపట్టిన పవన్..రేపు (బుధవారం) పెడన (Pedana ) లో భారీ సభ నిర్వహించబోతున్నారు. ఇప్పటీకే జనసేన శ్రేణులు సభకు సంబదించిన ఏర్పాట్లు పూర్తీ చేసారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్..పెడన సభ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని..ఇప్పటికే పెద్ద ఎత్తున క్రిమినల్స్ ను దించారని పవన్ అన్నారు. పబ్లిక్ మీటింగ్‌లో రాళ్ళ దాడి చేసి గొడవ చేయాలని ప్లాన్ చేశారంటున్నారన్నారు. తమ పెడన సభలో గొడవలు సృష్టిస్తే.. సహించమని హెచ్చరించారు. సీఎం, డీజీపీ, ఇతర అధికారులు జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలన్నారు. టీడీపీ, జనసేన పొత్తును విచ్చిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాళ్ల దాడి జరిగినా, క్రిమినల్స్ ఎటాక్ చేసినా.. ప్రభుత్వం, డీజీపీలదే బాధ్యత అని అన్నారు. జిల్లా ఎస్పీలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పవన్ విజ్ఞప్తి చేసారు. ఈ వ్యాఖ్యలతో రేపు ఏం జరుగుతుందో అని అంత టెన్షన్ పడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసారు..? దాడి చేయబోతున్నట్లు ఎవరు చెప్పారు..? ఎలా తెలిసింది అనేది అంత మాట్లాడుకుంటున్నారు.

నేడు మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్‌ను చేనేత కార్మికులు కలిసి తమ సమస్యలు ఏకరువుపెట్టారు.

Read Also  : Chandrababu CM : ఏపీలో అధికారం టీడీపీదే.! ఆత్మ‌సాక్షి లేటెస్ట్ స‌ర్వే వెల్ల‌డి!!