ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఢిల్లీ (Delhi) లో బిజీ బిజీ గా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. పెండింగ్ ప్రాజెక్టులు.. ఇతర అంశాలపై వారితో చర్చలు జరుపుతున్నారు. ఉదయం కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడారు. ఈ సందర్బంగా గత వైసీపీ సర్కార్ పై విమర్శలు కురిపించారు.
వైసీపీ ప్రభుత్వం బాధ్యత, జవాబుదారీతనం, పారదర్శకత లేకుండా పాలించిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. సమోసాల కోసమే రూ.9 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. తనను ఇబ్బంది పెట్టిన వారిని ఎందుకు పట్టించుకోవట్లేదని మీడియా అడుగగా.. ఈ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గత ప్రభుత్వ పాలన బాధ్యతాయుతంగా జరగలేదని అన్నారు.ఏపీలో హోం శాఖ, శాంతి భద్రతలు తన పరిధిలో లేవని, పోలీసులను వారి పని చేసుకోనివ్వాలని, తన పని తాను చేస్తానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇక కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పవన్ కళ్యాణ్ భేటీ విషయానికి వస్తే… ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో చర్చించారు. ఏపీలో టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ సహా మొత్తం ఏడు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించడం జరిగింది. రాష్ట్రంలో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కేంద్రం సహకారాన్ని కోరారు. వీటిపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని పవన్ తెలిపారు.
Read Also : Ambedkar Constitution : లోకేష్ ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అంటూ అంబటి విమర్శలు