Site icon HashtagU Telugu

Pawan Kalyan : వైసీపీ తిట్టిన తిట్లుకు.. నా భార్యకి క్షమాపణలు చెప్పాను..

Pawan Kalyan Said Sorry To His Wife For Ysrcp Leaders Cheap Comments

Pawan Kalyan Said Sorry To His Wife For Ysrcp Leaders Cheap Comments

Pawan Kalyan : ఏపీ ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చింది. నేటితో ఎన్నికల ప్రచారాలు ముగియనున్నాయి. కాగా నిన్న శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్.. తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేసారు. ఈ పర్యటనలో వైసీపీ నాయకులు తిట్టే తిట్లు వల్ల తన కుటుంబం ఎంత బాధపడుతుందో పవన్ కళ్యాణ్ తెలియజేసారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి క్యాడర్ వరకు.. ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకువస్తూ చాలా దారుణంగా మాట్లాడుతుంటారు.

అయితే ఈ వ్యాఖ్యలు పై పవన్ కళ్యాణ్ కూడా కౌంటర్ ఇస్తూనే వచ్చారు. కానీ రీసెంట్ గా ఆ మాటలు వల్ల తన భార్య ఎంతలా బాధపడుతుందో తెలియజేసారు. పవన్ మాట్లాడుతూ.. “నా భార్య విదేశిరాలు. ఇక్కడి వ్యక్తి కాదు. అయినాసరి ఆమెను కూడా తిట్టారు. ఆమెకు భారతదేశ రాజకీయాలు తెలియదు. వీళ్ళు తిట్టే తిట్లు చూసి ఆమె ఇబ్బంది పడింది, బయపడింది, ఎందుకు ఇలా ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు అని ప్రశ్నించింది. ఆమెకు ఏం చెప్పాలో తెలియక క్షమించమని అడిగాను” అంటూ చెప్పుకొచ్చారు.

‘ఇన్ని మాటలు అంటున్నా ఎందుకు ఇలా రాజకీయాల్లో పని చేస్తున్నావు..?’ అని పవన్ ని తన భార్య ప్రశ్నించారట. దానికి పవన్ బదులిస్తూ.. “నీ బిడ్డలు భవిషత్తు చూసుకోవడానికి నీ భర్తను అయిన నేను ఉన్నాను. కానీ రాష్ట్రంలోని ఎంతోమంది బిడ్డలు తమ భవిషత్తు తెలియక ఆందోళనలో ఉన్నారు. వారికీ నా అవసరం ఉంది. ఇది నా బలహీనతో లేక తలరాతో తెలియదు. నేను వాళ్ళ కోసం పోరాడాలి. ఆ ప్రజలు కోసం మన కుటుంబం బలి అయినా నాకు సంతోషమే అని చెప్పాను. అయిన నేను ఎందుకు జనం కోసం నిలబడుతున్నానో తెలియాలంటే.. రేపు పోలింగ్ రోజు పిఠాపురం రమ్మని చెప్పాను. అక్కడికి వచ్చి చూడు నీకే అర్థమవుతుందని ఆమెకు చెప్పాను” అంటూ పేర్కొన్నారు.