Pawan Kalyan: ప‌వ‌న్ వ్యూహం ఫ‌లిస్తుందా? తూర్పు కాపుల స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

తూర్పు కాపుల అభ్యున్నతికోసం జనసేన పాటుపడుతుందని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు. తూర్పు కాపులకు ఓబీసీ ధ్రువీకరణ పత్రాలు విషయంలో తారతమ్యాలు ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు.

  • Written By:
  • Updated On - June 27, 2023 / 10:36 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) భీమవరం (Bhimavaram) లో బీసీ నేతలతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ కల్యాణ్ (Pawan Kalyan)  స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో తూర్పు కాపు సంఘం అధ్యక్షులు చంద్రమోహన్ (Chandramohan) తో పాటు మరో 450 మంది జ‌న‌సేన పార్టీలో చేరారు. వీరికి ప‌వ‌న్ పార్టీ కండువా క‌ప్పి ఆహ్వానించారు. ఈ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఎక్కువగా వలస వెళ్ళిపోతున్నారు. దేశంలో పెద్ద ఎత్తయిన నిర్మాణాలు ఎక్కడ జరిగినా అక్కడ ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉంటారు. అంత దైర్య వంతులు ఉత్తరాంధ్ర తూర్పు కాపులు. ఏపీలో తూర్పుకాపుల సంఖ్యను వివిధ రాజకీయ పార్టీలు చెబుతున్న లెక్కలను ప‌వ‌న్ క‌ళ్యాణ్ తప్పుపట్టారు. వైసీపీ ప్ర‌భుత్వం తూర్పు కాపుల జ‌నాభా 16ల‌క్ష‌లుగా చెబుతుంది. ఈ లెక్క‌కు ఏది ప్రాతిప‌దిక‌? ప‌థ‌కాలు అంద‌కుండా చేయ‌డానికి వైసీపీ ప్ర‌భుత్వం అలా చెబుతోంద‌ని ప‌వ‌న్ ఆరోపించారు. జ‌న‌సేన ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే తూర్పు కాపుల గ‌ణ‌న చేప‌డ‌తామ‌ని చెప్పారు.

సమాజంలో అందరినీ సమానంగా చూస్తే ఈ కులాల గొడవ ఉండదు. తూర్పు కాపుల్లో బలమైన రాజకీయ నేతలు ఉన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారు కులాన్ని పట్టించుకోకుండా కులం పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదుగుతున్నారు. తూర్పు కాపులకు ఓబీసీ ధ్రువీకరణ పత్రాలు విషయంలో తారతమ్యాలు ఎందుకో అర్థం కావడం లేదు. తెలంగాణలో సైతం కొంతమందిని బీసీ కులాల జాబితా నుండి తొలగించారు. అప్పుడు కూడా ఏ ప్రజా ప్రతినిధి ప్రశ్నించలేదని ప‌వ‌న్ అన్నారు. రాష్ట్ర విభజన వలన బీసీ కులానికి చెందిన కాపులు తీవ్రంగా నష్టపోయార‌ని, తూర్పు కాపుల అభ్యున్నత కోసం జనసేన పాటుపడుతుందని పవ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.

ప‌వ‌న్ వ్యూహం ఫ‌లిస్తుందా..

వారాహి యాత్ర ప్రారంభించిన ద‌గ్గ‌ర నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ వ్యూహం మార్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ముఖ్యంగా తూర్పు గోదావ‌రి జిల్లాల్లో కాపు వ‌ర్గాల‌ను త‌న‌వైపుకు ఆక‌ర్షించుకొనేందుకు ఈ యాత్ర‌ను చేస్తున్న‌ట్లుగా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లాల్లో కాపులు, తూర్పు కాపుల జ‌నాభా ఎక్కువే. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించాలంటే వీరి ఓటు బ్యాంకే కీల‌కంగా ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ వ‌ర్గాల‌వారు అధిక శాతం వైసీపీ వెంట ఉన్నారు. వారంద‌రిని జ‌న‌సేన వైపుకు మ‌ళ్లించేందుకు ప‌వ‌న్ టార్గెట్‌గా పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది.

నిన్న‌టి వ‌ర‌కు కులాల ప్ర‌స్తావ‌న ఎందుకు తెస్తున్నార‌ని ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌.. వారాహి యాత్ర‌తో త‌న రాజ‌కీయ వ్యూహాన్ని మార్చిన‌ట్లు తాజా ప‌రిణామాల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. కాపు, తూర్పు కాపు వ‌ర్గాలే టార్గెట్ ప‌వ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప‌వ‌న్ అనుకున్న ల‌క్ష్యం పూర్త‌యితే, అధికార వైసీపీ పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న భావ‌న‌ను రాజ‌కీయ విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు.

Mumbai Traffic Police : వీడెవ‌డండీ బాబూ.. ఒక్క బైక్‌పై ఏడుగురితో ప్ర‌యాణం.. తాట‌తీసిన పోలీసులు