Pawan Kalyan : వైసీపీ కుట్రలు, కుతంత్రాలు సమర్థవంతంగా ఎదుర్కోవాలి – పవన్

ఈ 40 రోజులు చాలా కీలకమని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలు సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పోలింగ్ ముగిసేంతవరకు క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కార్యకర్తలు కలిసి పని చేయాలన్నారు

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan (2)

Pawan Kalyan (2)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan ) పిఠాపురం (Pithapuram)లో ఎన్నికల ప్రచారంలో బిజీ గా ఉన్నారు. ఏపీలో ఎన్నికలకు పట్టుమని 40 రోజులు కూడా లేకపోవడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎవరికీ వారు వారి వారి హామీలను కురిపిస్తూ …ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తన ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుండి తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.

ఈరోజు కూటమి కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ఈ 40 రోజులు చాలా కీలకమని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలు సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పోలింగ్ ముగిసేంతవరకు క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కార్యకర్తలు కలిసి పని చేయాలన్నారు. పిఠాపురంలో మన విజయం తథ్యమని.. చరిత్రలో నిలిచిపోయేలా పిఠాపురం గెలుపు ఉండాలని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. దేశంలోనే పిఠాపురం ఒక రోల్ మోడల్ నియోజకవర్గం అవుతుందన్నారు. వర్మ త్యాగం చాలా గొప్పది.. ఆయన ఉన్నత స్థానంలో ఉండేలా తాను ప్రయత్నం చేస్తాను భరోసా ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈరోజు పవన్ కల్యాణ్ తమ పార్టీ నుంచి మరో అభ్యర్దిని ప్రకటించారు. జనసేనకు కూటమిలో ఒప్పందంలో భాగంగా 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు దక్కాయి. అందులో పవన్ ఇప్పటి వరకు 18 స్థానాలకు అభ్యర్దులను అధికారికంగా ప్రకటించారు. అదే విధంగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్దిగా బాలశౌరి పేరు ఖరారు చేసారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్దిగా ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖాయమైంది. మూడు పెండింగ్ స్థానాల్లో భాగంగా విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పేరును పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Read Also : Weather Update: తెలంగాణకు ఐఎండీ వార్నింగ్

  Last Updated: 31 Mar 2024, 07:52 PM IST