Pawan Kalyan: టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఎవరైనా నేరారోపణ కేసులో ఇరుక్కుంటే, అరెస్టైన 31వ రోజు తమ పదవిని కోల్పోయే చట్టాన్ని తీసుకురాబోతోందని గుర్తు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

Pawan Kalyan: శ్రీశైలం అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఉద్యోగులతో జరిగిన ఘర్షణ, దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక సమర్పించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేశారు.

వివరాలు కోరిన పవన్ కళ్యాణ్

అటవీ శాఖ ఉన్నతాధికారులు పవన్‌కు ఈ ఘటన గురించి వివరించారు. శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు ఈ ఘర్షణలో పాల్గొన్నారని తెలుసుకున్న పవన్, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చట్టాలను అతిక్రమించి నేరపూరిత చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించకూడదని, వారిపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

Also Read: Tata Nexon: టాటా నెక్సాన్ ధర తగ్గనుందా? చిన్న కార్లపై తగ్గే జీఎస్టీ ప్రభావం!

నియంత్రణతో వ్యవహరించాలని హితవు

“చట్టానికి అందరూ సమానమే. చట్టం ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే, ఆ వ్యక్తి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఒక్కటే” అని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఎవరైనా నేరారోపణ కేసులో ఇరుక్కుంటే, అరెస్టైన 31వ రోజు తమ పదవిని కోల్పోయే చట్టాన్ని తీసుకురాబోతోందని గుర్తు చేశారు.

Also Read: Deputy CM Bhatti: 12% జీఎస్టీ స్లాబ్ తొలగింపును స్వాగతించిన డిప్యూటీ సీఎం భట్టి

“మేము తప్పు చేసినా బాధ్యులను చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా శాసనసభలో స్పష్టంగా చెప్పాం. మా ప్రభుత్వం నిబద్ధతతో, నియంత్రణతో విధులు నిర్వర్తిస్తుంది. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలి” అని ఆయన హితవు పలికారు. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

  Last Updated: 20 Aug 2025, 10:54 PM IST