Site icon HashtagU Telugu

Pawan On Konaseema Violence : కోన‌సీమ విధ్వంసంపై ప‌వ‌న్ రియాక్ష‌న్‌

Political parties NTR

Pawan Kalyan

కోనసీమ జిల్లాలో చెలరేగిన హింసాకాండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజుల క్రితమే జిల్లాలను విభజించిందని, అన్ని జిల్లాలకు ఒక విధానాన్ని రూపొందించి, కోనసీమకు ప్రత్యేక విధానాన్ని అవలంబించిందని అభిప్రాయపడ్డారు. అన్ని జిల్లాలకు నామకరణం చేసే రోజున జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే బాగుండేదన్నారు.
YouTube video player

జాతీయ స్థాయి నేతల పేర్లు పెట్టడాన్ని తాను వ్యతిరేకించబోనని స్పష్టం చేసిన జనసేన అధినేత కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు పెట్టారని, నెల్లూరుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టారని గుర్తు చేశారు. విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని కోణాల్లోనూ ఆలోచించాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ఇప్పుడు జిల్లా పేరు ఎందుకు మార్చిందని, దీనిపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు. దళితుడి హత్యకు సంబంధించి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ప్రమేయం ఉందని ఆ విషయాన్ని దారి మళ్లించేందుకు ఇది ముందస్తు ప్రణాళికతో కూడిన హింస అని జనసేన అధినేత ఆరోపించారు.