Pawan Kalyan : పవన్ ఇంతకు తెగించారా? ఇదే నిజమైతే…పరిస్థితేంటి.!

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి....నిజానికి చాలా దేశ భక్తి ఉన్నోడు. అలాంటి వ్యక్తిని ఇవాళ దేశద్రోహి అనే ముద్ర వేయడానికి....వైసీపీ ఎంతో ఉవ్విళ్లూరుతోంది

  • Written By:
  • Updated On - April 25, 2024 / 04:00 PM IST

పవన్ కళ్యాణ్ నిజంగా జాతీయ జెండా(Pawan Kalyan )ను అవమానించారా? మువ్వెన్నల జెండాను పవన్ కళ్యాణ్ ఎడమ చేత్తో పట్టుకోవడమే….జనసేనాని చేసిన పాపమా? ఇప్పుడు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి….నిజానికి చాలా దేశ భక్తి ఉన్నోడు. అలాంటి వ్యక్తిని ఇవాళ దేశద్రోహి అనే ముద్ర వేయడానికి….వైసీపీ ఎంతో ఉవ్విళ్లూరుతోంది. దీనికి కారణం ఏంటంటే… పిఠాపురం(Pithapuram)లో పవన్ నామినేషన్ (Pawan’s Nomination) వేసారు. ఈ సందర్భంగా చాలా మంది జనసేన నాయకులు, ఇటు కూటమి నేతలు… ఇంకా బుల్లితెర నటులు కూడా కొంతమంది హాజరయ్యారు.

అయితే.. ఈ ర్యాలీలో ఇసుకేస్తే..రాలనంత జనం వచ్చారు. నిజంగా చెప్పాలి అంటే….ముఖ్యమంత్రిగానో… మంత్రిగానో ప్రమాణ స్వీకారనికి వెళుతున్నారా అన్నట్టు అనిపించింది. పవన్ సభకు కార్యకర్తలను వెళ్లనివ్వకుండా అక్కడక్కడ అడ్డుకునేందుకు కూడా వైసీపీ ప్రయత్నించింది. అయినా కూడా కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై…. నామినేషన్ కార్యక్రమాన్ని ఓ రేంజ్‌లో సక్సెస్ చేసారు. అయితే ఇక్కడ వరకు బానే ఉంది. కానీ…ఇంతమంది కార్యకర్తలు, బుల్లితెర నటులు రావడాన్ని వైసీపీ జీర్ణించుకోలేక పోతోంది. దీన్ని ఎలా అయినా తిప్పిగొట్టాలని గట్టిగానే పట్టుపట్టి….పవన్ మీద బురద జల్లాలని ప్రయత్నిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

నామినేషన్‌కు వెళ్లే క్రమంలో పవన్…కూటమి జెండాలతో పాటు మన జాతీయ జెండాను పట్టుకున్నారు. అయితే ఈ ఒక్క పాయింట్‌ని పట్టుకుని…..వైసీపీ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతుంది. అసలు ఎడమ చేత్తో జాతీయ జెండాను ఎలా పట్టుకుంటారని నానా హడావుడీ చేసేస్తోంది. వాస్తవానికి జాతీయ జెండాను ఎడమ చేత్తో పట్టుకోకూడదా అంటే…మన వీలుని బట్టి పట్టుకోవచ్చు. కానీ… కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జెండాను పట్టుకునే విధానం…జెండా ఉండే హైట్‌ని… పరిగణలోకి తీసుకుంటారు. కానీ పవన్ మీద బురద జల్లాలని వైసీపీ కావాలనే చేస్తోందని అందరికీ తెలుసు. కానీ…వాస్తవానికి జాతీయ జెండాను ఎవరైనా ప్రదర్శించొచ్చు. ఐతే… దాన్ని అత్యున్నత స్థానంలో ఉంచి ప్రదర్శించాలి. పొలిటికల్ ఫ్లాగ్స్‌తో అస్సలు ప్రదర్శించకూడదు. ఒకవేళ జాతీయ జెండాను ప్రదర్శించినప్పుడు…. తప్పనిసరిగా జెండా కుడిచేతిలో మాత్రమే ఉండాలి. కానీ… జనసేన అధినేత పవన్.. ఎడమ చేతితో ప్రదర్శించారన్న విజువల్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇలా చేస్తే తప్పకుండా అది కోడ్ ఉల్లంఘన కిందే వస్తుందని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు. దీనిపై రాజకీయ ప్రత్యర్థులు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది పవన్ కు ఇబ్బందికర పరిణామమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
చూద్దాం ఏంజరుగుతుందో..

Read Also : Vidadala Rajini : ‘విడదల రజిని’ కిడ్నాప్..