Site icon HashtagU Telugu

Pawan Kalyan : జనసేన నాయకులను విడుదల చేయండి…లేదంటే నేనే పోలీస్ స్టేషన్ కు వస్తా..!!

Pawan

Pawan

విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో బాధ్యులైనవారిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విశాఖలో పోలీసుల తీరు బాగలేదు. జనసేన పోలీసులను ఎప్పుడూ గౌరవిస్తుంది. మా జనసేన నాయకులను అరెస్టు చేయడం బాధాకరం. డీజీపీ తక్షణమే వారిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే నేనే పోలీస్ స్టేషన్ వచ్చి మా వాళ్లకు సంఘీభావం తెలుపుతానంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

కాగా శనివారం విశాఖ ఎయిర్ పోర్టు వద్ద మంత్రులు, వైసీపీ నాయకులపై జనసేన నాయకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైనవారిని పోలీసులు అరెస్టు చేశారు.వారిపై 307తో పాటుపలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. హోటల్ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.