Site icon HashtagU Telugu

Pawan Kalyan : రాష్ట్రాన్ని ఏలే మహారాణి కొంచెం జాగ్రత్త అంటూ జగన్ ఫై పవన్ సెటైర్లు

Pawan Speech Rajampet

Pawan Speech Rajampet

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రచారం లో తనదైన శైలి లో దూకుడు పెంచుతున్నాడు. రోజు రోజుకు జగన్ (Jagan) ఫై కొత్త కొత్త గా..ఘాటు ఘాటుగా కామెంట్స్ చేస్తూ కూటమి శ్రేణుల్లో ఉత్సహం..వైసీపీ శ్రేణుల్లో నిరాశ నింపుతున్నారు. పదునైన డైలాగ్ లతో ప్రచారంలో ఫుల్ ఖుషి చేస్తున్నారు. తాజాగా ఈరోజు తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో మరోసారి జగన్ ఫై సెటైర్లు వేసి ఆకట్టుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…. మన రాష్ట్రాన్ని ఏలే మహారాణి కొంచెం జాగ్రత్తగా ఉండాలి… విద్యార్థులు కక్ష పెంచేసుకుంటారు… ఆ మహారాణి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైంది… కొత్త తరానికి భవిష్యత్ ఇచ్చేందుకు దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

తాజాగా కాకినాడ ఆదిత్య కాలేజీ వద్ద సీఎం జగన్ కాన్వాయి ఆగగానే అక్కడే ఉన్న స్టూడెంట్స్ పెద్ద ఎత్తున బాబులకే బాబు కళ్యాణ్ బాబు..అంటూ సీఎం సీఎం పవన్ కళ్యాణ్ సీఎం అంటూ జగన్ వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీనికి సంబదించిన వీడియోస్ వైరల్ కావడం తో..పవన్ కళ్యాణ్ పరదాల మహారాణి అంటూ తనదైన శైలి లో జగన్ ఫై సెటైర్లు వేశారు. ఇక ఈ సభలో బిజెపి చీఫ్ పురందేశ్వరి సైతం పాల్గొన్నారు.

ఈ క్రమంలో పవన్ ..రాజమండ్రి పార్లమెంటు స్థానానికి దగ్గుబాటి పురందేశ్వరి గారు పోటీ చేస్తున్నారు… వారికి నా శుభాకాంక్షలు. అలాగే, గాజుగ్లాసు గుర్తుపై రాజానగరం అసెంబ్లీ స్థానం జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. వారికి నా శుభాకాంక్షలు అంటూ కూటమి నేతలకు ప్రత్యేకంగా పవన్ శుభాకాంక్షలు తెలిపి వారిలో సంతోషం నింపారు.

Read Also : Nani : కొడుకుతో కలిసి జెర్సీ స్పెషల్ షో చూసిన నాని.. స్క్రీన్ పై తండ్రిని చూస్తూ..