Site icon HashtagU Telugu

Pawan Kalyan : కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా..? నేతలపై పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Bhimavaram

Pawan Bhimavaram

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (Bhimavaram)లో పర్యటించిన ఆయన.. పలువురు నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ .. ఎన్నికలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

” జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఈ రోజుల్లో కుదరని పని. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని నేను అన్నట్లు చెప్తున్నారు. కానీ ఎప్పుడూ నేను అలా అనలేదు. ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘం కూడా 45 లక్షలకు పెంచింది. డబ్బులు ఖర్చుచేయకుండా రాజకీయాలు చేద్దామంటే ఈ రోజుల్లో కుదరని పని. కనీసం భోజనాలైనా పెట్టుకుండా పాలిటిక్స్ చేద్దామంటే అవదు. నా కోసం అభిమానులు వస్తారు. అందుకే డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందేనని నాయకులకు అందరికీ ముందే చెప్పా. ఇక ఓట్లు కొనాలా వద్దా అనేది మీ నిర్ణయం. కనీసం 2029 తర్వాతైనా డబ్బులతో ఓట్లు కొనని రాజకీయం రావాలి. అప్పుడు నిజమైన డెవలప్ మెంట్ జరుగుతుంది ” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

‘సామాజిక న్యాయం అంటూ బీసీలను వైసీపీ మోసం చేస్తుందని, వారికి ప్రాధాన్యం లేని పోస్టులు కట్టబెడుతుందని పవన్ ఆరోపించారు. సంఖ్యాబలం కులాలది.. అధికారం జగన్ ది అని , గొప్ప వ్యక్తులను కులాలకు అతీతంగా చూడాలి అని సూచించారు. నేను సోషల్ ఇంజినీరింగ్ అమలు చేస్తున్నా. నేను అందరి కోసం పనిచేస్తున్నా’ అని పేర్కొన్నారు. అభివృద్ధి చేసే బటన్లు నొక్కాలని, అప్పులు చేసి నొక్కడం ఏంటని ఈ సందర్బంగా జగన్ను ప్రశ్నించారు. ‘వైఎస్ చాలా కష్టపడి వేల కోట్లు సంపాదించారు. ఆ ఆస్తిలో సొంత చెల్లి షర్మిలకే సీఎం వాటాలు పంచడం లేదు. అలాంటి వ్యక్తి ప్రజలకు ఏం వాటాలు పంచుతారు..? అని ప్రశ్నించారు. కేవలం కాపుల కోసమే పార్టీ పెట్టలేదని, అందరి కోసం పార్టీ పెట్టేనని, నేను ఎక్కడికి పారిపోయే వ్యక్తిని కాను, ఎదురుతిరిగి పోరాడే వ్యక్తిని’ అని ఆయన పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే పొత్తుల ఫై స్పందిస్తూ.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడినట్లు పవన్ పేర్కొన్నారు. ‘జాతీయ నాయకత్వంతో ఎన్ని చీవాట్లు తిన్నానో నాకే తెలుసు. వాళ్లను ఒప్పించడానికి నానా మాటలు పడ్డాను. రెండు చేతులు జోడించి, దండం పెట్టి అడిగాను. నేనెప్పుడూ నా కోసం అడగలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అడిగాను.. తిట్టినా భరించాను’ అని పవన్ తన ఆవేదనను వ్యక్తం చేసారు.

ఇక ఈసారి పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఓ అద్దె ఇంటిని వెతకమని పార్టీ నేతలకు సూచించారట. గత ఎన్నికల్లో పవన్ కు భీమవరంలో 62,285 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులుకు 54,037 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్ది గ్రంధి శ్రీనివాస్ కు 70,642 ఓట్లు రాగా.. ఆయన 8,357 ఓట్లతో విజయం సాధించారు. ఈ సారి టీడీపీ మద్దతుతో పోటీ చేయటం ద్వారా పవన్ గెలిచి అసెంబ్లీలో భీమవరం నుంచే అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అటు వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను సీఎం జగన్ ఖరారు చేసారు. దీంతో ఈసారి ఎలాగైనా గ్రంధిని ఓడించాలని పవన్ ఫిక్స్ అయ్యాడు. గత ఎన్నికల్లో స్వల్ప ఆటలతో గ్రంధి గెలవడం తో..ఈ సారి టీడీపీ, జనసేన కలవటం ద్వారా పవన్ గెలుపు ఖాయమని అంత విశ్లేషిస్తున్నారు.

Read Also : CM Revanth Reddy : పార్లమెంట్‌లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి – సీఎం రేవంత్