జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..వైసీపీ పార్టీ ఫై ఏమాత్రం దూకుడు తగ్గించడం లేదు. పబ్లిక్ సభల్లో ఎలాగైతే మాటల తూటాలు పేలుస్తూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాడో..మీడియా సమావేశాల్లో కూడా వైసీపీ చేస్తున్న పనులపై..రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు , అరాచకాలు , దోపిడీలు ఇలా ప్రతి వాటిపై ప్రశ్నిస్తున్నారు.
తాజాగా శుక్రవారం మీడియా సమావేశంలో మరోసారి వైసీపీ (YCP) ఫై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగులకు (AP Government Employees salary) టైంకు జీతాలు ఇవ్వడం లేదు..20 వ తారీకు వచ్చిన వారికీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్ అధికారులకు నెల నెలా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని తెలిపాడు. ఇది నిజంగా రాష్ట్రానికి సిగ్గు చేటన్నారు. ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులకు ఇవ్వాల్సిన జీతాలను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఏకరువు పెట్టారు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అంటూ పవన్ ప్రశ్నించాడు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే తన లక్ష్యమని .. ఢిల్లీలో బీజేపీ నేతలతో కూడా ఇదే విషయం చెప్పానని జనసేనాని స్పష్టం చేశారు. తాము ఎన్ని చోట్ల పోటీ చేస్తాం.. ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది మీకు అనవసరమని వైసీపీ నేతలకు చురకలంటించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున తన కార్యక్రమాల కోసం వెళ్తుంటే తనను ఆపేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో సమన్వయం కోసం ఐదుగురితో జనసేన పార్టీ కమిటీ వేసిందన్నారు.
అలాగే చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఫై చిత్రసీమ స్పందించకపోవడం ఫై పవన్ స్పందించారు. చిత్రసీమ మీద పూర్తి ఒత్తిడి ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో స్పందించడానికి కూడా సినిమా వాళ్లు భయపడతారని పవన్ చెప్పుకొచ్చారు. గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే మండలాధీశుడు వంటి చాలా సినిమాలు తీశారు. కోట, పృధ్వీ వంటి వారు ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో నటించారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. అందుకే ఏం మాట్లాడాలన్న భయంతో ఉన్నారని తెలిపారు. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి.. మొండి వాడ్ని కాబట్టి.. నేను స్పందించాను అని వ్యాఖ్యానించారు.
Read Also : Nara Lokesh : నారా లోకేష్ టంగ్ స్లిప్ అవ్వడంతో.. థాంక్స్ చెప్పిన మంత్రి రోజా