Site icon HashtagU Telugu

CBN : ఐదేళ్లు కాదు..దశాబ్దం పాటు చంద్రబాబు సీఎం గా ఉండాలి – పవన్ కళ్యాణ్

Pawan Babu

Pawan Babu

ఐదేళ్లు కాదు..దశాబ్దం పాటు చంద్రబాబు సీఎం (Chandrababu CM) గా ఉండాలని అసెంబ్లీ లో జనసేనధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపి టీడీపీ శ్రేణుల్లో సంబరాలు , జనసేన శ్రేణుల్లో నిరాశను నింపారు. 2014 ఎన్నికల్లో NDA తో జతకట్టిన పవన్ కళ్యాణ్..2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి జగన్ గెలుపుకు కారణమయ్యారు. మొన్న 2024 లో జరిగిన ఎన్నికల్లో మాత్రం 2019 తప్పు రిపీట్ కావొద్దని చెప్పి బిజెపి , చంద్రబాబు తో జత కట్టి ప్రభుత్వం ఏర్పాటు లో కీలక భాగమయ్యారు. ఈరోజు డిప్యూటీ సీఎం గా , పలు శాఖలకు మంత్రిగా పవన్ కళ్యాణ్ తన మార్క్ పాలన ను కొనసాగిస్తున్నారు. రోజు రోజుకు పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం గ్యారెంటీ అని జనసేన శ్రేణులు నమ్ముతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ ఇప్పుడు వారిలో షాక్ ను కలిగిస్తుంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 150 రోజులు కావొస్తున్న నేపథ్యంలో శాసనసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినందుకు సీఎంకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి అని చంద్రబాబు నిరూపించారని ప్రశంసలు కురిపించారు. బుడమేరు వరద సమయంలో ఆయన చూపించిన చొరవ ఎంతో గొప్పది. ఆఫీసులో కూర్చుని ఆదేశాలు ఇవ్వగలిగే సత్తా ఉన్నా కూడా అధికారుల్లో ప్రజల్లో ధైర్యం నింపడానికి బురదలో సైతం దిగారు అని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి శిథిలమై పోయిన రోడ్లు, గంజాయి, ఇసుక దోపిడీలు రివర్స్ టెండరింగులు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆలయాల్లో అపవిత్రం, మద్యం దోపిడీలు, వారసత్వంగా వచ్చే అని పేర్కొన్నారు.

అనుభవమున్న చంద్రబాబు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని , గత ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకు వెళ్లిందని , గత ప్రభుత్వం పాస్ బుక్‌లో కూడా ముఖ్యమంత్రి ఫోటోలు వేయించుకున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం లో నెల మొదటి రోజున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. 64 లక్షల లబ్ధిదారులకు 4000 చొప్పున పెంచి అందిస్తున్నామన్నారు. బూతులు పోస్ట్ చేసే సోషల్ యాక్టివిటీస్ ల అణచివేతలో ముఖ్యమంత్రి చంద్రబాబు , హోంమంత్రి అనిత తీసుకున్న కఠినమైన చర్యలు అభినందనీయమని కొనియాడారు. ఈ విధంగానే కొనసాగాలని కోరుకున్నట్టు తెలిపారు. ‘సీఎం చంద్రబాబుకు మాట ఇస్తున్నా, మేం చేయాల్సిన పనులపై ఆదేశాలు ఇవ్వాలి.. సీఎం చంద్రబాబు విజన్‌కు తగ్గట్టు పనిచేస్తాం.. సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం.. ఐదేళ్లు కాదు మరో దశాబ్దం చంద్రబాబు సీఎంగా ఉండాలి.. చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి.. ‘ పవన్ పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలకు అసెంబ్లీ మొత్తం చప్పట్లతో జై..జై లు కొట్టింది. అయితే జనసేన శ్రేణులు మాత్రం అదేంటి పవన్ ఇలా మాట్లాడాడారు. నెక్స్ట్ సీఎం పవన్ కల్యాణే అనుకుంటుంటే..పవన్ మాత్రం చంద్రబాబే సీఎం కావాలని కోరుకుంటున్నాడు ఏంటి..? అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. ఈరోజు ఉన్నది రేపు ఇలాగే ఉండదు కదా…ఇంకా నాలుగేళ్లు కలిసి పాలించాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఆలా అని ఉంటారని మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికి పవన్ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో సంతోషం నింపాయి.

Read Also : Lagacharla incident : మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాది మాదిరిగా ఎందుకు అరెస్టు చేశారు?: హైకోర్టు ఆగ్రహం