Praja Galam : ‘సీఎం జగన్ ఓ సారా వ్యాపారి’ అంటూ నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్

జగన్ తనని తాను ‘రావణాసురుడు’ అని అనుకుంటున్నాడని.. తన చుట్టూ బంగారంతో కట్టిన ప్రాకారం ఉందని భావిస్తున్నాడని.. అయితే నారచీర కట్టుకొని శ్రీరాముడు బాణంతో రావణుడ్ని చంపేశాడని గుర్తు చేశారు

  • Written By:
  • Publish Date - March 17, 2024 / 08:07 PM IST

ఏపీ సీఎం జగన్ ఫై మరోసారి నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ‘సీఎం జగన్ ఓ సారా వ్యాపారి. దేశమంతా డిజిటల్ వైపు అడుగులేస్తూ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే.. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో మాత్రం నగదు చలామణి చేసి దోచుకుంటున్నారు’ అని మండిపడ్డారు.

కూటమి పొత్తు ఫిక్స్ అయినా తర్వాత మొదటి సారి టీడీపీ , జనసేన , బిజెపి లు కలిసి చిలకలూరిపేటలోని బొప్పూడిలో ప్రజాగళం సభలో (Praja Galam Event) పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్య అతిదిగా ప్రధాని మోడీ హాజరు కాగా..టీడీపీ , జనసేన పార్టీల అధినేతలు , పార్టీ నేతలు , కార్యకర్తలు ఇలా అంత హాజరై సభను సక్సెస్ చేసారు. ఈ సభ లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (CM YS Jagan) జనసేనాధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఒక సారా వ్యాపారి అని.. ఐదేళ్లలో లక్షా 20 వేల కోట్ల వ్యాపారం జరిగితే, 84 వేల కోట్లు మాత్రమేనని అండర్ కోట్ చేశారని , పన్ను ఎగవేసి.. సొమ్ము దాచుకున్నారని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇసుక తవ్వకాలతో సీఎం జగన్ బినామీలు రూ.40 వేల కోట్లు దోచేశారు. రాష్ట్రం డ్రగ్స్ కు రాజధానిగా మారింది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయింది. ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. 2019లో పారిశ్రామిక ప్రగతి 10.24 శాతం ఉండగా.. ఈ రోజు -3 శాతానికి పడిపోయిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.’ అని పవన్ విమర్శించారు. ‘డిజిటల్ భారత్’ (Digital Bharat) అని ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే.. వైసీపీ మాత్రం ‘క్యాష్’ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని నిప్పులు చెరిగారు. మద్యం, ఇసుకలో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

వైఎస్ వివేకాను (YS Viveka ) హత్య చేయించిన ప్రభుత్వం ఇదని పవన్ కళ్యాణ్ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడిని కూడా అనేక ఇబ్బందులు పెట్టిందని, ఈ ప్రభుత్వం పోవాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ తనని తాను ‘రావణాసురుడు’ అని అనుకుంటున్నాడని.. తన చుట్టూ బంగారంతో కట్టిన ప్రాకారం ఉందని భావిస్తున్నాడని.. అయితే నారచీర కట్టుకొని శ్రీరాముడు బాణంతో రావణుడ్ని చంపేశాడని గుర్తు చేశారు. అన్ని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని.. రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని తూర్పారపట్టారు. అభివృద్ధి లేక ఏపీ అప్పులతో నలిగిపోతోందని.. దాష్టీకాలతో ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also : Prawns Pakoda: ఎంతో క్రిస్పీగా ఉండే రొయ్యల పకోడీ.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే?