Site icon HashtagU Telugu

AP Politics: కాసేపు కోడిగుడ్లు పొదగటం ఆపేసి వీటికి సమాధానాలు చెప్పు అమరం

AP Politics

New Web Story Copy 2023 08 10t144600.609

AP Politics: ఏపీలో రాజకీయాల జోరు రసవత్తరంగా సాగుతుంది. అధికార పార్టీ వైసీపీ, జనసేన పార్టీల మధ్య రోజురోజుకి వైరం పెరుగుతుంది. రాజకీయ విమర్శలు కాస్త హద్దు దాటి పర్సనల్ విషయాలను ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేపట్టిన వారాహి యాత్ర మరింత హీట్ పెంచింది. ఇక ప్రస్తుతం విశాఖపట్నం వేదికగా పవన్ వారాహి యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ నుండి ఎదురుదాడి మొదలైంది. ఈ సమయంలో జనసేన ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) కి సూటిగా 10 ప్రశ్నలు సంధించారు. కాసేపు కోడిగుడ్లు పొదగటం ఆపేసి వీటికి సమాధానాలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం వ్యంగ్యంగా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

గత 4 ఏళ్లలో అనకాపల్లి ప్రాంతానికి తమరు చేసిన అభివృద్ధి ఏంటి? కనీసం రోడ్ల నిర్మాణం అయినా చేశావా? మంత్రిగా అయ్యాక ఉత్తరాంధ్రకు నువ్వు చేసిందేంటి? అనకాపల్లి తుమ్మపాల చెక్కెర కర్మాగారం తెరిపించలేని దద్దమ్మవి నువ్వు కాదా? సొంత నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు పట్టించుకోని నీకు పరిశ్రమల శాఖ ఎందుకు దండగ? అంటూ ప్రశ్నలతో పాటు ఘాటైన విమర్శలు చేశారు. రాజధాని అమరావతి అని ప్రతిపక్షంలో సమర్ధించి ఇప్పుడు ఎందుకు మార్చావు? అక్కడి రైతులకు అన్యాయం ఎందుకు చేస్తున్నావు? రేపు విశాఖ ప్రజలకు అన్యాయం జరగదని గ్యారెంటీ ఎవరు ఇస్తారు? అని ప్రశ్నించడం ఎందుకు చేతకాలేదు? అధికారంలో ఉండి, పరిశ్రమల శాఖ మంత్రిగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం కోసం గట్టిగా నిలదీయలేని సన్నాసివి నువ్వు కాదా అనే విషయాన్ని ప్రజలకు తెలియజేశావా లేదా? మేము కేంద్రమంత్రిని కలిసి విశాఖ ఉక్కుకు అండగా నిలబడ్డాం, మరి నువ్వేం చేశావ్ అమరం ? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

ఐటీ (IT)మంత్రిగా రాష్ట్రానికి నువ్వు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? పెట్టుబలులు ఎన్ని ? కల్పించిన ఉద్యోగాలు ఎన్ని? IT, పరిశ్రమల శాఖా మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా అధమ స్థానంలో ఉన్న ఏకైక వ్యక్తి గుడివాడ అమర్నాద్ అనే విషయంలో ఏమైనా సందేహం ఉందా? విశాఖ నుండి పరిశ్రమలు, లూలు మాల్, రాయలసీమ నుండి అమర్ రాజా, లాంటి కంపెనీలు తరలిపోవాదనికి కారణం నీ లంచాల రాజకీయం?

నీ హయాంలో స్టార్టప్ ఇండియా లో కనీసం రాష్ట్రానికి స్థానం లేదు, అతితక్కువ స్టార్టప్ కంపెనీలు వచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని నిలబెట్టిన అసమర్ధుడు నువ్వు కాదా? ఆఖరికి జార్ఖండ్ లాంటి రాష్ట్రాలతో కూడా పోటీపడలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లిన అసమర్థుడు నువ్వు? రాష్ట్రంలో FDI పెట్టుబడులు ఎందుకు రావడం లేదు? ఎందుకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు? అసలు రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉంది? ఆఖరికి నువ్వు కొడుగుడ్లు పొదగడంలో కూడా అభివృద్ధి లేదు. రాష్ట్రంలో ఉపాధి ఎందుకు కల్పించలేకపోతున్నావు? ప్రతీ సంవత్సరం లక్షల్లో ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసుకుని బయటకు వస్తుంటే వారిలో కనీసం 10% మందికి కూడా ఉపాధి కల్పించలేని పరిస్థితిలో రాష్ట్రం ఎందుకు ఉంది?

ఉద్దానం అనే ప్రాంతం గురించి, సమస్య గురించి ఏ అధికారం లేని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయటపెట్టకపోయి ఉంటే ఏ ఒక్కరైనా దానిపై మాట్లాడేవారా? హార్వర్డ్ నుండి శాస్త్రవేత్తలను రప్పించి అక్కడ మార్పుకు పునాది వేసింది జనసేన.
మొన్న అనకాపల్లి వాలంటీర్ పింఛన్ డబ్బుతో పరారయ్యాడు, అందులో నీ కమీషన్ ఎంత? వాలంటీర్లతో డేటా అందుకు కలెక్ట్ చేయిస్తున్నారు? వారి అధిపతి ఎవరు? ఇది రాజ్యాంగ విరుద్ధమా కాదా? డేటా అడ్డుపెట్టుకుని జరిగే నేరాలకు భాద్యత ఎవ్వరూ తీసుకుంటారు అనే దానికి సమాదానం చెప్పకుండా, వాలంటీర్లను అడ్డుపెట్టుకుని మీ తప్పులు కప్పిపుచ్చుకుంటున్న సన్నాసి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ?

రాష్ట్రాన్ని సంక్షేమం పేరు చెప్పి అభివృద్ధి లేకుండా చేసి, అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసింది మీరు కాదా? విశాఖ లో రాజధాని పేరిట భూకుంభకోణాలకు, రియల్ ఎస్టేట్ మాఫియకు అడ్డా గా మార్చింది ఎవరు? సొంత పార్టీ ఎంపి ని చితకబాదింది ఎవరు? ఇదేనా అభివృద్ధి? విస్సన్నపేట భూముల్లో ఎంత భూమి దోచేశావ్ ఐటం రాజా అంటూ ధ్వజమెత్తారు. చివరిగా రాష్ట్ర యువతకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల పాలిట దరిద్రం, అభివృద్ధి నిరోధకుడు గుడివాడ అమర్నాద్ అని, మంత్రి వర్గంలో పనికిమాలిన వ్యక్తి నువ్వు అని ప్రజలు అంటున్నారు దీనికి నువ్వు సమాదానం చెప్పి తీరాలి అని డిమాండ్ చేశారు.

Also Read: Operation Vijayawada : జేపీ,వంగ‌వీటిపై YCP గురి