Pawan Kalyan Politics : ప‌వ‌న్ ష‌ణ్ముఖ వ్యూహం ఇదే!

జ‌న‌సేనా ప‌వన్ క‌ల్యాణ్ చెప్పిన ష‌ణ్ముఖ వ్యూహం ఏమిటి? ఆవిర్భావ స‌భ‌లో ఆయ‌న ఆ వ్యూహాన్ని ఎందుకు బ‌య‌ట‌కు తీశాడు?

  • Written By:
  • Publish Date - March 21, 2022 / 05:20 PM IST

జ‌న‌సేనా ప‌వన్ క‌ల్యాణ్ చెప్పిన ష‌ణ్ముఖ వ్యూహం ఏమిటి? ఆవిర్భావ స‌భ‌లో ఆయ‌న ఆ వ్యూహాన్ని ఎందుకు బ‌య‌ట‌కు తీశాడు? ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని ష‌ణ్ముఖ వ్యూహం ఏర్పాటు చేయ‌నుందా? ఆ వ్యూహంలోని రహ‌స్యాలు, కోణాలు ఏమిటి? అనేది ఇప్ప‌టికీ డిబేట‌బుల్ ఇష్యూగానే ఉంది. సాధార‌ణ ప‌త్రికాభాష‌లో చ‌తుర్ముఖ వ్యూహాన్ని ష‌ణ్ముఖ వ్యూహంగా కొత్త త‌ర‌హాలో ప‌వ‌న్ ప్రొజెక్ట్ చేశాడు. ప‌వ‌న్ వ‌ద్ద ఉన్న ఆ నాలుగు వ్యూహాలపై ఊహాగానాలు కోకొల్ల‌లు.బీజేపీ రోడ్ మ్యాప్ ప్ర‌కారం న‌డుచుకోవ‌డం ష‌ణ్ముఖ వ్యూహంలోని మొద‌టి ఎత్తుగ‌డ‌. దాన్ని ఆవిర్భావ వేదిక‌పై నుంచి ప‌వ‌న్ వెల్ల‌డించాడు. ఒక వేళ రోడ్ మ్యాప్ జ‌న‌సేనాని అనుకున్న ప్ర‌కారం లేక‌పోతే..రెండో వ్యూహం ఏమిటి? తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డ‌మేనంటూ చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక మూడో వ్యూహంగా కేజ్రీవాల్ క‌న్వీన‌ర్ గా ఉన్న ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం. నాలుగో వ్యూహంగా ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్, బ్ర‌ద‌ర్ అనిల్ పెట్ట‌బోయే పార్టీల‌ను క‌లుపుకుని వెళ్ల‌డం ష‌ణ్ముఖ వ్యూహ‌లోని నాలుగో ఎత్తుగ‌డ‌గా ఉంద‌ని టాక్‌.

మొత్తం మీద ఒంట‌రిగా మాత్రం పోటీ చేయ‌డానికి జ‌న‌సేన సాహ‌సం చేయ‌డంలేదు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో బీజేపీతో క‌లిసి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే, ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, టీడీపీ బ‌లం కూడా తోడు కావాల‌ని జ‌న‌సేన భావిస్తోంది. ఆ విష‌యాన్ని ఆవిర్భావ స‌భ‌లోనే ప‌రోక్షంగా ప‌వ‌న్ వెల్ల‌డించాడు. వ్య‌క్తిగ‌త ప్రయోజ‌నాల‌ను ప‌క్క‌న పెట్టి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా క‌లిసి రావాల‌ని స‌హ‌చ‌ర పార్టీల‌కు పిలుపునిచ్చాడు. వాటిలో టీడీపీ, కాంగ్రెస్‌, ఉభ‌య క‌మ్యూనిస్ట్‌ పార్టీలు ఉన్నాయి. కానీ, బీజేపీకి అనుకూలంగా వెళ్లే జ‌న‌సేన‌తో కామ్రేడ్లు, కాంగ్రెస్ క‌లిసి వెళ్లే ప్ర‌స‌క్తే ఉండ‌దు. కాబ‌ట్టి 2014 త‌ర‌హాలో బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మిగా వెళ్లే రోడ్ మ్యాప్ కోసం ప‌వ‌న్ ఎదురుచూస్తున్నాడు. అదే ష‌ణ్ముఖ వ్యూహంలోని తొలి ఎత్తుగ‌డ‌.తెలుగుదేశం పార్టీని ద‌గ్గ‌ర‌కు తీసే ఆలోచ‌న మోడీ, షా ద్వ‌యానికి లేదు. వ్య‌క్తిగ‌తంగా మోడీని 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు టార్గెట్ చేశాడు. పైగా 1999, 2004, 2014 పొత్తుల స‌మ‌యంలో టీడీపీ వ్య‌వ‌హ‌రించిన తీరుపై బీజేపీ అధిష్టానం అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. ఫ‌లితంగా టీడీపీతో క‌లిసి వెళ్ల‌కుండా కేవ‌లం జ‌న‌సేన, బీజేపీ మాత్ర‌మే పొత్తుతో వెళ్లే అవకాశం ఉందా? అనే అంశంపై ఢిల్లీ పెద్ద‌లు అంచ‌నాలు వేస్తున్నారు. కానీ, ఆ రెండు పార్టీల‌కు ఏపీలో ఉన్న బ‌లం త‌క్కువ‌. ఒక వేళ ఢిల్లీ బీజేపీ టీడీపీ పొత్తును నిరాక‌రిస్తే, బీజేపీకి దూరం కావ‌డానికి జ‌న‌సేనాని రెడీగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వెళ్ల‌డం ష‌ణ్ముఖ వ్యూహంలోని రెండో ఎత్త‌గ‌డ‌గా ఆ పార్టీ భావిస్తోంది.

ఆప్‌, జ‌న‌సేన భావ‌జాలం కొన్ని విష‌యాల్లో ద‌గ్గ‌ర‌గా ఉంది. డ‌బ్బు లేకుండా రాజ‌కీయాలు చేయాల‌నే ల‌క్ష్యం ఆ రెండు పార్టీల్లో కనిపిస్తోంది. ఆ కోణం నుంచి ఆప్ తో క‌లిసి జ‌న‌సేన చ‌రిత్ర సృష్టించాల‌ని పార్టీలోని కొంద‌రి ఉవాచ‌. కానీ, ఆప్ కు ఏపీలో ఏ మాత్రం ఉనికి లేదు. అయిన‌ప్ప‌టికీ దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ , ప‌వ‌న్ కు ఉన్న ఇమేజ్ క‌లిపి ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి స‌రిపోతాయ‌ని కొంద‌రి లెక్క‌. ప్ర‌స్తుతం ఆప్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్త‌రిస్తోంది. పైగా స‌మ‌కాలీన రాజ‌కీయాల‌తో విసిగిపోయిన జ‌నం ఆప్ వైపు చూస్తున్నారు. సో…ఆప్ తో పొత్తు పెట్ట‌కుని ఈసారి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం జ‌న‌సేన ష‌ణ్ముఖ వ్యూహంలోని మూడో ఎత్తుగ‌డగా క‌నిపిస్తోంది.2019లో బీఎస్పీతో పొత్తుపెట్టుకుని జ‌న‌సేన ఎన్నిక‌ల‌కు వెళ్లింది. ఇప్పుడు ఆ పార్టీని ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ విస్త‌రింప చేస్తున్నాడు. స్వారోల రూపంలో ఆ పార్టీ బ‌ల ప‌డింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాప‌కింద నీరులా ప‌నిచేస్తోంది. దీనికి తోడు బ్ర‌ద‌ర్ అనిల్ కొత్త పార్టీని జ‌గ‌న్ స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా పెట్ట‌బోతున్నాడు. ఆ మేర‌కు గ్రౌండ్ వ‌ర్క్ కూడా త‌యారు అయింది. అటు బీఎస్పీ ఇటు బ్ర‌ద‌ర్ అనిల్ పార్టీలు క్రిస్టియ‌న్‌, ద‌ళిత ఓటు బ్యాంకును ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటాయి. జ‌న‌సేనకు కాపు ఓటు బ్యాంకు ప‌దిలంగా ఉంటుంది. ఇలాంటి ఈక్వేష‌న్ తో బీఎస్పీ, బ్ర‌ద‌ర్ అనిల్ పార్టీల‌తో క‌లిసి రాబోవు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం జ‌న‌సేన పార్టీ వ‌ద్ద ఉన్న ష‌ణ్ముఖ వ్యూహంలోని నాలుగో ఎత్తుగ‌డ‌గా ఆ పార్టీ వ‌ర్గాల్లో అంత‌ర్గ‌త చ‌ర్చ జ‌రుగుతోంది.
మొత్తం మీద ప‌వ‌న్ చెప్పిన ష‌ణ్ముఖ వ్యూహంలోని అంత‌రార్థాన్ని ప‌లువురు ప‌లు విధాలుగా అన్వ‌యించుకుంటున్నారు. ఆయ‌న చెప్పిన చతుర్మ‌ఖ వ్యూహంలోని ఎత్తుగ‌డ‌లు చాలా బ‌లంగా ఉన్నాయి. వాటిలో ఏదో ఒక దానిపై జ‌న‌సేన స్టాండ్ కాలంటే ముందుగా బీజేపీ రోడ్ మ్యాప్ ను వెల్ల‌డించాలి. దాని కోసం జ‌న సైనికులు ఎదురు చూస్తున్నారు. సో..ప‌వ‌న్ ఆవిర్భావ స‌భ‌లో చెప్పిన ష‌ణ్ముఖ వ్యూహంలోని చిక్కుముడి అద‌న్న‌మాట‌.