Site icon HashtagU Telugu

Pawan Kalyan Pithapuram Tour : పవన్ కు అడుగడుగునా నీరాజనాలు పలికిన ప్రజలు

Pawan Pitapuram Peole

Pawan Pitapuram Peole

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు పిఠాపురం (Pithapuram ) ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికి తమ మద్దతును తెలియజేసారు. గత ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగిన జనసేన కేవలం సింగిల్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండు చోట్ల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్..ఎక్కడ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ పడకుండా ఓడిన చోటే గెలవాలని..కష్టపడుతూ ..జనసేన గ్రాఫ్ ను పెంచుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు టీడీపీ , బిజెపి లతో కలిసి బరిలోకి దిగారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ప్రచారంలో భాగంగా జనసేన నాల్గు రోజులుగా పిఠాపురం లో పర్యటిస్తూ వస్తున్నారు. కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల్లో మంగళవారం పవన్ పర్యటించారు. మహిళలు, రైతులు, కార్మికులు, యువత.. ఇలా వివిధ వర్గాల వారిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వారితో కూర్చుని వారికి ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ప్రజల సమస్య లు పరిష్కరిస్తానని, నియోజవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ముందుకు సాగారు. ‘అన్నా బాగున్నారా.. మా వీధికి రా అన్నా.. మా ఇంటికి రా అన్నా..’ అంటూ మత్స్యకారులు, ఎస్సీ మహిళలు, గ్రామీణులు ఆత్మీయంగా ఆహ్వానిస్తుంటే కాదనలేక ఆయన ప్రతి గడప దగ్గరా ఆగారు. ఆరుబయట మంచాల పైన, గుమ్మాల దగ్గర కాసేపు కూర్చుని జనసేనాని జనంతో ఆప్యాయంగా మమేకం అయ్యారు. ఇసుకపల్లి- నాగులపల్లి రోడ్డులో కొబ్బరి బొండాలు అమ్మే తాతబ్బాయి దగ్గర కాసేపు కూర్చుని సమస్యలు విన్నారు. ‘ఎమ్మెల్యేగా గెలిచాక నాకు ఇల్లు కట్టివ్వాలి’ అని తాతబ్బాయి కోరారు. పొన్నాడలో సపోటా తోటల వద్ద కౌలు రైతులతో మాట్లాడారు. వరి పొలాలు పరిశీలించారు. మత్స్యకారుడు ఏడిది శేషు ఇంటి దగ్గర నులక మంచంపై కూర్చుని ముచ్చటించారు. కొత్తగా పెళ్లైన మణికంఠస్వామి, అన్నపూర్ణలకు పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.

Read Also : Encounter : ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌.. 13కు చేరిన మృతుల సంఖ్య