Site icon HashtagU Telugu

Pawan Kalyan Pedana Speech : సీఎం జగన్‌కు ఒంట్లో పావలా దమ్ము లేదు – పవన్ కళ్యాణ్

Pawan Kalyan Public Meeting at Pedana

Pawan Kalyan Public Meeting at Pedana

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి సీఎం జగన్ ఫై , వైసీపీ ప్రభుత్వం (YCP) ఫై మాటల తూటాలు పేల్చారు. ప్రస్తుతం పవన్ 4 వ విడత వారాహి యాత్ర (Varahi Yatra) చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అవనిగడ్డ లో ప్రారంభమైన ఈ యాత్ర..ఈరోజు పెడన కు చేరుకుంది. ఈ సందర్బంగా పెడన లో ఏర్పాటు చేసిన సభలో పవన్ తనదైన శైలి లో జగన్ ఫై విరుచుకపడ్డారు. సీఎం జగన్‌కు ఒంట్లో పావలా దమ్ము లేదని , వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనమేనని..రాబోయేది జనసేన – టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

ఉపాధి కూలీల పొట్ట కొట్టింది జగన్ (Jagan) ప్రభుత్వం

ఏడాదిగా మన రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం.. ఏపీకి రావాలంటే పాస్ పోర్టు, వీసా తీసుకుని రావాల్సిన పరిస్థితి జగన్ తీసుకొచ్చారని పవన్ మండిపడ్డారు. ఓట్లు వేయించుకునేందుకే జగన్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది. అమలు వరకు వచ్చేసరికి పథకాల్లో అంతా డొల్లతనమే కనిపిస్తుందన్నారు పవన్. నిధుల మళ్లింపులో రాష్ట్రానిదే అగ్రస్థానమని కేంద్రం చెబుతుందని..వైసీపీ ప్రభుత్వం.. ఉపాధి కూలీల పొట్ట కొట్టింది. సగానికి సగం ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారు. ప్రశ్నించే వారిపై పలురకాల కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

పెడనలో వైసీపీ మూకలు అంబేడ్కర్ విగ్రహానికి జనసైనికులను కట్టేసి కొట్టారు. ఈ విషయాన్ని మేము మర్చిపోం. వైసీపీ నేతల అక్రమాలను ప్రశ్నింనందుకే జనసైనికులను కొట్టారు. వాళ్లు ఉన్న ఏరియాలోకి జనసైనికులు వెళ్లకూడదంట. రాబోయే ఎన్నికల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడుదాం అని పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డిది రూపాయి పావలా ప్రభుత్వం. ప్రజలను తమ దగ్గరకు రప్పించుకోవడానికే వైసీపీ నేతలు రూపాయి పావలా సిద్ధాంతం వాడుతున్నారు.

ఏపీలో కుల భావన ఎక్కువ.. జాతి భావన తక్కువ

జగన్ ఏపీ బంగారు భవిష్యత్తు కాదు.. ఆయనో విపత్తు. 28 లక్షల ఇళ్లు కడతామని చెప్పి 3 లక్షల ఇళ్లే కట్టారు. ఇళ్ల పేరుతో రూ.4 వేల కోట్లు దోచేశారని నివేదికలు చెబుతున్నాయి. ప్లాస్టిక్‌పై నిషేదం పేరుతో ప్లెక్సీలను నిషేధించారు. నా సినిమాలు, పుట్టినరోజు వచ్చినప్పుడే ప్లాస్టిక్‌పై వీరికి నిషేధం గుర్తుకువస్తుంది. ఏపీలో కుల భావన ఎక్కువ.. జాతి భావన తక్కువ. కొనకళ్ల నారాయణపై దాడి.. నాకు చాలా ఆవేదన కలిగించింది. ప్రజలను కులాలుగా విడదీసి నేను రాజకీయాలు చేయను. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరీనీ చూస్తా. ఏపీ ప్రజలు గర్వంగా తలెత్తుకుని బతకాలనేదే నా ఆశయం.

Read Also : Hyderabad: పాతబస్తీ అభివృద్ధిపై కేటీఆర్ ఫోకస్