Pawan Kalyan : జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జాతీయ రాజకీయాల్లోకి ( National Politics) ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? పవన్ కళ్యాణ్ లోకల్ రాజకీయాల్లో కంటే జాతీయ రాజకీయాల్లో ఉంటేనే మార్పు వస్తుందని భావిస్తుందా..? బిజెపి మాస్టర్ ప్లాన్ ఇదేనా..? ఇప్పుడు బిజెపి పొత్తు కుదిరిన తరువాత రాష్ట్ర ప్రజలు , అభిమానులు , జనసేన శ్రేణులు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఏపీలో అతి త్వరలో అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో […]

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan

Pawan is a key reference for Janasainiks

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జాతీయ రాజకీయాల్లోకి ( National Politics) ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? పవన్ కళ్యాణ్ లోకల్ రాజకీయాల్లో కంటే జాతీయ రాజకీయాల్లో ఉంటేనే మార్పు వస్తుందని భావిస్తుందా..? బిజెపి మాస్టర్ ప్లాన్ ఇదేనా..? ఇప్పుడు బిజెపి పొత్తు కుదిరిన తరువాత రాష్ట్ర ప్రజలు , అభిమానులు , జనసేన శ్రేణులు ఇలాగే మాట్లాడుకుంటున్నారు.

ఏపీలో అతి త్వరలో అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయి. మొన్నటి వరకు టిడిపి – జనసేన పొత్తు మాత్రమే అనుకున్న ఇప్పుడు కేంద్ర అధికార పార్టీ బిజెపి (BJP) సైతం చేయి కలిపింది. ఢిల్లీ వేదికగా ఈ పొత్తులు సఫలం అయ్యాయి. గత మూడు రోజులుగా బిజెపి నేతలతో చర్చలు జరుపుతూ వచ్చిన చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు మొత్తానికి పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో అడుగుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మూడు పార్టీల సీట్ల సర్దుపాటు అనేది తెలియాల్సి ఉంది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటె ఈ పొత్తు వెనుక పవన్ కళ్యాణ్ కృష్టి ఎంత ఉన్నదనేది తెలియంది కాదు. రాష్ట్రం బాగుపడాలంటే..కేంద్ర సహకారం తప్పనిసరి అని మొదటి నుండి చెపుతూ వచ్చిన పవన్..టిడిపి కూటమి తో బిజెపి కలిసేలా చేసింది కూడా ఆయనే. కానీ ఈ పొత్తు వెనుక భారీ వ్యూహం ఉన్నట్టుగా అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుస్తే.. పవన్ కల్యాణ్‌ను కేంద్ర రాజకీయాల్లోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్‌ను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ అగ్ర నేతలు సూచించినట్లుగా సమచారం. ఈ ఆదేశాలతోనే పవన్ కల్యాణ్ కాకినాడ లేదా అనకాపల్లి నుంచి ఏదో ఒక చోట ఎంపీ బరిలో ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని ఇప్పటికే సర్వే ద్వారా ధీమాగా ఉన్న ఆ పార్టీ నేతలు పవన్ కల్యాణ్ ఎంపీగా గెలిస్తే ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఎన్నికల తర్వాత బీజేపీలో జనసేనను విలీనం చేసి పూర్తి స్థాయి ఏపీ బాధ్యతలు పవన్ కల్యాణ్‌కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం పవన్ అసెంబ్లీ తో పాటు లోక్ సభ స్థానం కు పోటీ చేయబోతున్నాడు.

Read Also : Miss World 2024 : ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా గొప్ప పనులు.. తెలుసా ?

  Last Updated: 10 Mar 2024, 01:13 PM IST