Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌ పేరుపై 9 కార్లు.. కానీ..!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.

  • Written By:
  • Publish Date - April 23, 2024 / 07:22 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేబ్రోలులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా పిఠాపురం చేరుకుని పిఠాపురంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ) కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీలో పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండాలు పట్టుకుని మోటారు సైకిళ్లు, కార్లతో ర్యాలీ దారి పొడవునా మద్దతుదారులు పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. జై జన సేన…’ అంటూ ర్యాలీలో ప్రతిధ్వనించారు. పిఠాపురం మరియు దాని పరిసర ప్రాంతాలలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ర్యాలీ పవన్ కళ్యాణ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి వీలుగా పాదగయ కేష్త్రం వద్ద ముగిసింది.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీతో పాటు బీజేపీ మద్దతుతో ఆయన పిఠాపురం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్న పవన్‌ కళ్యాణ్‌.. అఫిడవిట్‌లో పవన్ తన ఆదాయం గత ఐదేళ్లలో రూ. 114.76 కోట్లు అని తెలిపారు.. అంతేకాకుండా… రూ. 73.92 కోట్లు పన్నులు (ఐటి మరియు జిఎస్‌టి) చెల్లించినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు.. రూ. 64.26 కోట్లు అప్పులు ఉన్నాయని తన అఫిడవిట్‌లో పవన్‌ తెలిపారు. పవన్ కళ్యాణ్ పేరు మీద తొమ్మిది కార్లు, బైక్, పికప్ వ్యాన్ ఉన్నాయని, అందులో కొన్ని ఖరీదైన లగ్జరీ వాహనాలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే జాబితాలో వారాహి వాహనం ప్రస్తావన లేదు.

ఈ వాహనాలన్నింటి విలువ రూ. 14,01,85,401 (రూ. 14.01 కోట్లు). ఈ జాబితాలో మెర్సిడెజ్ బెంజ్-ఆర్ క్లాస్ 350 (రూ. 72.95 లక్షలు), మహీంద్రా స్కార్పియో ఎస్8 (రూ. 13.82 లక్షలు), మెర్సిడెజ్ బెంజ్ మేబ్యాక్ ఎస్ క్లాస్ 560 (రూ. 2.42 కోట్లు), రేంజ్ రోవర్ స్పోర్ట్ (రూ. 5.47 కోట్లు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ (రూ. 2.53 కోట్లు), టయోటా వెల్‌ఫైర్ (రూ. 1.11 కోట్లు), జీప్ రాంగ్లర్ (రూ. 71.54 లక్షలు), మహీంద్రా స్కార్పియో ఎస్ 11 (రూ. 23.49 లక్షలు) మరియు మహీంద్రా స్కార్పియో ఎస్ 13 (రూ. 4.9 లక్షలు). పవన్ పేరుతో హార్లీ డేవిడ్‌సన్ హెరిటేజ్ బైక్ (రూ. 32.66 లక్షలు), టాటా యోధా పికప్ ట్రక్ (రూ. 9.19 లక్షలు) ఉన్నాయి.
Read Also :AP Politics : వైసీపీ అక్రమ సంబంధానికి ఇదే నిదర్శనం..!