Site icon HashtagU Telugu

Pawan Kalyan: ఇప్పటం బాధితులకు పవన్ ‘లక్ష’ ఆర్థికసాయం!

Pawan

Pawan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలనే ఇప్పటంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన ఇళ్లు కోల్పోయిన బాధితులకు ధైర్యం చెప్పి జగన్ ప్రభుత్వాన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులకు చేయూతనందించారు. స్వయంగా ఇప్పటం వెళ్లి బాధితులను పరామర్శించి, వారి ఆవేదనను విన్న పవన్ (Janasena chief).. తాజాగా వారికి లక్ష రూపాయాల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadenadla manohar) మీడియాకు తెలియజేశారు.

నాదెండ్ల మాట్లాడుతూ.. ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోయారన్నారు. పవన్ కళ్యాణ్ బాధితులకు లక్ష రూపాయలు సాయం ప్రకటించారని తెలిపారు. తన వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని తమ అధినేత నిర్ణయించారని అన్నారు. జనసేన (Janasena) ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని కక్షగట్టి ఇళ్లను కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. జె.సి.బి.లను పెట్టి, పోలీసులను మోహరింప చేసి అరెస్టు చేయించారన్నారు. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని ఆయన తెలిపారు.