Pawan Kalyan Nomination : పవన్ నామినేషన్ ముహూర్తం ఫిక్స్..

పిఠాపురం నుండి బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ ..ఈ నెల 22న పిఠాపురంలో తన నామినేషన్ దాఖలు చేయబోతున్నాడు

  • Written By:
  • Publish Date - April 17, 2024 / 09:03 PM IST

జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) ను ఈసారి ఎమ్మెల్యే గా చూడాలని అభిమానులు , సినీ ప్రముఖులు, పార్టీ శ్రేణులే కాదు ఇతర పార్టీ శ్రేణులు కూడా కోరుకుంటున్నారు. గత పదేళ్లకు పైగా ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎమ్మెల్యే అవ్వలేదు. వాస్తవానికి ఆయన గత ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసాడు. అంతకు ముందు తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి , 2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీ కి మద్దతు తెలిపాడు.

We’re now on WhatsApp. Click to Join.

గత ఎన్నికల్లో మాత్రం రెండు చోట్ల నుండి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యాడు. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ పడకుండా పార్టీ నడుపుతూ..ఈరోజు ఎన్నికల బరిలో తనతో పాటు మరో 22 మందిని నిల్చోపెట్టాడు. ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో 21 మంది అసెంబ్లీ అభ్యర్థులకు , అలాగే 2 పార్లమెంట్ అభ్యర్థులకు బి ఫారాలను అందజేసి పలు సూచనలు చేసారు. ఇక రేపటి నుండి నామినేషన్ల ( Nominations) పర్వం మొదలుకాబోతుండడం తో నేతలంతా తమ జాతకాలను బట్టి ఏ తేదీన నామినేషన్ వేస్తే బాగుంటుందని చూసుకుంటున్నారు.ఈ క్రమంలో పిఠాపురం నుండి బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ ..ఈ నెల 22న పిఠాపురంలో తన నామినేషన్ (Pawan Kalyan Nomination) దాఖలు చేయబోతున్నాడు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Read Also : TMC Manifesto 2024 : టీఎంసీ మేనిఫెస్టో రిలీజ్