Pawan Kalyan: ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో నా వ్య‌క్తిగ‌త ప‌ర్య‌వేక్ష‌ణ‌ ఉంటుంది.. జ‌న‌సేన జెండా ఎగ‌రేయాలి..

అన్ని జిల్లాలకు అన్నంపెట్టే నెల గోదావరి జిల్లాలు. అందుకే వారాహి యాత్రను ఇక్కడ నుండే ప్రారంభించాన‌ని ప‌వ‌న్ చెప్పారు.

  • Written By:
  • Updated On - June 24, 2023 / 08:14 PM IST

జ‌న‌సేన (Janasena) అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) పి.గ‌న్న‌వ‌రం (P. Gannavaram) నియోజ‌క‌వ‌ర్గం నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. దిండి రిసార్ట్స్ లో జ‌రిగిన స‌మావేశంలో నేత‌ల‌కు ప‌వ‌న్ ప‌లు సూచ‌న‌లు చేశారు. గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే లాగా పారిపోకూడదు కమిట్మెంట్ ఉండాల‌ని అన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అన్నిచోట్ల ఓడిపోతే ఒక్క రాజోలులో మాత్రమే గెలిచాం. పక్క నియోజక వర్గం రాజోలు (Rajolu) ను స్ఫూర్తిగా తీసుకోవాలి. చీకటి గా ఉన్న జనసేన‌కు వెలుగు నిచ్చింది రాజోలు. రాజోలు నియోజకవర్గం, పి గన్నవరం నియోజకవర్గం ఇకనుంచి నా వ్యక్తిగత పర్యవేక్షణలో ఉంటాయ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోని నేత‌ల‌తో మాట్లాడ‌తాన‌ని, ఈసారి ఇక్క‌డ జ‌న‌సేన జెండా ఎగ‌రాల‌ని ప‌వ‌న్ నేత‌ల‌కు సూచించారు.

పి.గన్నవరం, రాజోలు నుండి వస్తుంటే ఇసుక తిప్పలు రోడ్డు పక్కనే కొండల్లా వేశారు. ఇక్క‌డ జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై జ‌న‌సైనికులు పెద్దెత్తున పోరాటం చేయాలి. అధికార పార్టీ నేత‌ల అక్ర‌మాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ప‌వ‌న్ సూచించారు. వారాహి యాత్ర గోదావ‌రి జిల్లాల నుంచి ఎందుకు ప్రారంభించార‌ని అడుగుతున్నారు.. అన్ని జిల్లాలకు అన్నంపెట్టే నెల గోదావరి జిల్లాలు. అందుకే వారాహి యాత్రను ఇక్కడ నుండే ప్రారంభించాన‌ని ప‌వ‌న్ చెప్పారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఎవరికి ఇచ్చామన్నది కాదు.. మనందరం కలిసి పనిచేసే వ్యక్తిని ఎన్నుకున్నామా లేదాఅన్నది కావాలి. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని హత్య చేస్తే చట్టాలు ఏమయ్యాయి అని ప్ర‌శ్నించారు. జ‌న‌సేన‌లోని కొంద‌రు నేత‌లు పార్టీ నాయకుల్లో పనిచేసే ఇంకొక నాయకుడు గురించి చెప్తే నా క్రెడిబిలిటీ తగ్గిపోతుందని ఆలోచిస్తున్నారు. అది స‌రైన ప‌ద్ద‌తి కాదు. పార్టీకి కష్టపడిన వాళ్లందర్నీ గుర్తిస్తాను. అందులో జ‌న‌సైనికులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవ‌ద్దు. ఈసారి పి.గన్నవరంలో జనసేన జెండా ఎగరాలి. ఆ మేర‌కు జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క‌లిసి ప‌నిచేయాల‌ని ప‌వ‌న్ సూచించారు.

Guinness World Records : 60 సెకన్లలో 10 విన్యాసాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆవు..